Home దునియా ఊరన్నకాడ తాకట్టు పెట్టెటోల్లు మస్తుంటరు

ఊరన్నకాడ తాకట్టు పెట్టెటోల్లు మస్తుంటరు

Village-People

పెద్ద మనుషుల కలుస్తరు. ఒకాయన పెద్దమనిషి దగ్గరికిపోతె ఆ ఊరి సర్పంచ్ కావచ్చు ఇంకెవలన్న మోతుబరి కావచ్చు లేదా కులం పెద్ద కావచ్చు ఆయన ఇద్దరిని పిలిపిచ్చి దడ్వత్ పెట్టిచ్చుకుంటడు. దడ్వత్ అంటే పైసలు డిపాజిట్ చేసుడు తర్వాత చెరో పెద్దమనుషులను కోరుకొని పంచాయితీకి కూసోని తెంపుకుంటరు సదరు పెద్ద మనిషి ఇద్దరి చెరో పెద్ద మనిషి ముగ్గురి కల్సిపోయింది కాయిదం రాస్తరు. 

ఊరు అంటే అంత మంచే కాదు కొందరు తాకట్టు పెట్టెటోల్లు తిప్పలు పెట్టెటోల్లు. శిక్కులు తెచ్చెటోల్లు సుత మస్తు మంది ఉంటరు. తాకట్లు పెట్టుడంటే పాలోల్ల మధ్యన ఇద్దరు అన్నదమ్ముల మధ్యన జవుడం పుట్టిస్తరు. లేదా కొంచెం సమస్య ఉంటే దాన్ని పెద్దగ చేస్తరు. చిన్న కొట్లాట ఉంటే దాన్ని రగిలెటట్టు చేస్తరు. ఊర్లల్ల ఎక్కువ గెట్ల పంచాయితీలు ఉంటయి. బాయిల కాడ ఇద్దరి ఆ సాముల మధ్య కనీలు పీకుడు ఉంటది లేదా జరుపుడు ఉంటది లేదా ఒడ్డు చెక్కకు పంచాయితీ ఉంటది.

ఇద్దరి మధ్య పొలంల ఒడ్లు హద్దులుగ ఉంటే అవతలి పక్కాయన తన దిక్కు ఎక్కువ గడ్డి పెరిగిందని చెక్కుతడు. ఇవతాలయనకు దాని మీది నుంచి నడవరాదు. అప్పుడు పంచాయితీ సుర్వు అయితది. పెద్ద మనుషుల కలుస్తరు. ఒకాయన పెద్దమనిషి దగ్గరికిపోతె ఆ ఊరి సర్పంచ్ కావచ్చు ఇంకెవలన్న మోతుబరి కావచ్చు లేదా కులం పెద్ద కావచ్చు ఆయన ఇద్దరిని పిలిపిచ్చి దడ్వత్ పెట్టిచ్చుకుంటడు.

దడ్వత్ అంటే పైసలు డిపాజిట్ చేసుడు తర్వాత చెరో పెద్దమనుషులను కోరుకొని పంచాయితీకి కూసోని తెంపుకుంటరు సదరు పెద్ద మనిషి ఇద్దరి చెరో పెద్ద మనిషి ముగ్గురి కల్సిపోయింది కాయిదం రాస్తరు. తప్పుడు చేసినోనికి పాయమాల్ ఏస్తరు. ఇంతవరకు మంచిగనే ఉంటది గని ఇసోంటి కాడ తాకట్లు పెట్టెవాల్లు అక్కడక్కడ అన్ని కులాలల్ల ఉంటరు. వాల్లతోనే వస్తది లొల్లి.

మీ భూమి ఎన్కట తాతల కాలంల రద్దుబదలు చేసికున్నరు ఇప్పుడు వల్లకు పోయినదాంట్ల మీకు ఎక్కువ వస్తది మర్ల పడుండ్రి అంటే మర్లపడుతరు అప్పుడు లొల్లి ముదురుతది ఇట్ల బాయిలకాడికి బాట పంచాయితీల ఇంటి నీడ పంచాయితీలు చిన్నదానికి పెద్దదానికి బారీ పంచాయితీలు కుత్సిత మనస్తత్వాలు ఊర్లల్ల సుత అక్కడక్కడ ఉంటాయి.

అవి పురాగ బందు కాలేదు ఎన్కట 1980 దశకంల అన్నలకాలం ఇసొంటి పంచాయితీలు లేకుండే ఎమన్న అంటే రాత్రిపూట అన్నలు వచ్చి దంచుతరనే భయం ఉండె. ఆ తర్వాత కాలంల లేకుంటపోయింది. ఎందుకో చాల మంది మంచి మనుషులే ఉంటరు గని కొంతమంది మాత్రం మనిషికి మనిషి మధ్య తాకట్లు పెట్టెటోల్లు ఉంటరు. ఆఖరుకు సందు దొరికితే ఇద్దరు ఆలుమగల మధ్యల సుత చిచ్చు పెట్టెటోల్లు ఉంటరు. ఆ తర్వాత ఎవలకైనా తెలుస్తది గని పంచాయితీ జరిగిపోయి మనుసులు బాధపడుతయి.

అయితె ఈ సందుల ఊర్లల్ల సుత ఓర్వలేని గుణాలు కల వాల్లు ఎక్కువ అయతండ్రు ఊర్లు ఊర్ల లెక్కలేవు ప్రేమ అనురాగం తక్కువ అయినయి ఎన్కట నాయినా చిచ్చా అన్న తాత అని పిలుసుకునేది ఇప్పుడు వరుసలు సుత మాయమైపోతున్నయి అంటండ్రు పట్నంకు దగ్గర ఉన్న పల్లెలు సిటి వాసన తగిలి ఇంకా పురాగ అడివి అయితండ్రు.

ఎందుకంటే సచ్చమైన కల్లు ఇడిశిపెట్టి మందుకు అలవాటైతండ్రు ఊరూరికి బరండి షాపులు, బెల్టుషాపులు తయారై మనుషుల మధ్య దూరం చేస్తున్నయని ఈ నడుమ నేను మా ఊరికి పోయినప్పుడు ఒగ పెద్ద మనిషి అనంగా ఇన్న మాటలు ప్రపంచంపైన సుట్టు తిరుగుతంది. మనుషులు అట్లనే అయిండ్రు తాకట్లు పెట్టె గుణాలు కొందరి పుట్టుకతోనే వస్తుండవచ్చు. వాల్లు మాత్రం ఏం సుఖపడుతరు. అందరు కల్సి ఉండాలె ఊర్లు సల్లగుండాలె.

-అన్నవరం దేవేందర్, సెల్ :9440763479