Search
Friday 16 November 2018
  • :
  • :

ఈ తారలు రియల్ స్పోర్ట్ స్టార్లు

Sports-Starsసినీ ఇండస్ట్రీ పూర్తిగా గ్లామర్ ప్రపంచం. ఈ గ్లామర్ రంగంలో నిలదొక్కుకోవడం అంటే చాలా క్లిష్టమైన విషయం. గతంలో చాలా మంది తాము డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వేరువేరు ప్రొఫెషన్స్‌లో నేషనల్ లెవెల్‌కు ఎదిగిన వాళ్లు కూడా ఇప్పుడు చిత్ర పరిశ్రమలో బాగా రాణించేస్తున్నారు. స్పోర్ట్ పర్సనాలిటీస్‌గా వెలిగిపోయిన వారు కూడా వెండి తెరపై తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వెంకటేష్ హిట్ మూవీ ‘గురు’లో నటించిన హీరోయిన్ రితికా సింగ్ నేషనల్ లెవెల్ కిక్ బాక్సర్ మాత్రమే కాదు… మార్షల్ ఆర్ట్ ఎక్స్‌పర్ట్ కూడా. ప్రస్తుతం ఈ భామ తమిళ్, తెలుగులో హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నా స్పోర్ట్‌ను పక్కన పెట్టే సమస్యే లేదని ఆమె చెబుతోంది. స్పోర్ట్ స్టార్ అయిన పాపులర్ నటి రోండా రౌజీనే తనకు స్ఫూర్తి అంటోంది రితికాసింగ్. ఫైటర్‌గా కెరీర్‌ను కొనసాగిస్తూనే సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తానంటోంది ఈ భామ.  ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో నటిస్తున్నాడు హీరో సుధీర్ బాబు. నిజానికి ఈ కథానాయకుడు ఓ నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం విశేషం. అందుకే తన పాత్రకు సుధీర్ బాబు సరిగ్గా సరిపోతాడని గోపీచంద్ అంటున్నారు. హాట్ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. వరుసగా హిట్ సినిమాలు చేస్తూ తెలుగులో టాప్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ భామ. సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు జోడీగా ‘స్పైడర్’లో నటించిన ఆమె ఒక ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్ అనే విషయం చాలా మందికి తెలియదు. తండ్రి మార్గదర్శకత్వంలో తనకు పెద్దగా ప్రపంచం గురించి తెలియకముందే గోల్ఫ్‌లో ఆరితేరానని చెబుతోంది రకుల్. అయితే 19 ఏళ్ల వయసు వచ్చాకే మోడలింగ్‌లోకి అడుగుపెట్టేందుకు అనుమతి ఇస్తానని తండ్రి చెప్పడంతో… అప్పటివరకు గోల్ఫ్ విపరీతంగా ఆడేదట ఈ భామ. ఇప్పుడు కూడా ఆదివారాలు, సెలవు రోజుల్లో గోల్ఫ్ ఆడతానని చెబుతోంది రకుల్. నటుడు, దర్శకుడిగా  శ్రీనివాస్ అవసరాల టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. రాకెట్ బాల్ ప్లేయర్ అయిన అతను… 2014లో సౌత్ కొరియాలో జరిగిన ఆసియా ఓపెన్ వరల్డ్ రాకెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం రాకెట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా శ్రీనివాస్ అవసరాల ఉండడం విశేషం. చదువుకునే రోజుల నుంచి ఈ స్పోర్ట్‌పై ఆసక్తితో అతను అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగాడు. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంత కాలం పాటు నటనతో పాటు ఈ కెరీర్‌ను కూడా కొనసాగించానని చెప్పాడు ఈ హీరో. ‘కంచె’ షూటింగ్ సమయంలో కుడి అరచేతికి దెబ్బ తగలడంతో ఈ గేమ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందట. యంగ్ హీరో నాగశౌర్య నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ అనే సంగతి చాలా మందికి తెలియదు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా  టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్నాడట ఈ కథానాయకుడు. యంగ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్ అయితే ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో ప్రీ నేషనల్స్ వరకు వెళ్లింది కూడా. కానీ చిత్ర పరిశ్రమపై ఉన్న మక్కువతో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ తార. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది ఈ అమ్మడు. ఇలా టాలీవుడ్‌లో పలువురు తారలు ఒకప్పుడు స్పోర్ట్‌లో రాణించి ఇ ప్పుడు చిత్ర పరిశ్రమలో తమ సత్తా చాటుతున్నారు.

Comments

comments