Home కెరీర్ ఇష్టపడి చదివితే బ్యాంకింగ్ కొలువులు ఈజీ!

ఇష్టపడి చదివితే బ్యాంకింగ్ కొలువులు ఈజీ!

These jobs are more attractive to younger than other jobs

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 4,252 కొలువులు                                                                                                                ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వూ ద్వారా ఎంపిక
అక్టోబరు 13, 14, 20, 21 తేదీల్లో ప్రిలిమినరీ                                                                                                            నవంబర్ 18న మెయిన్స్ పరీక్షలు 

ఎన్ని రకాల ఉద్యోగాలున్నా బ్యాంకు ఉద్యోగాలకు ఎప్పుడూ క్రేజ్ తగ్గదు. ఉద్యోగ భద్రత కావచ్చు, మంచి జీతభత్యాలు కావచ్చు.. మంచి భవిష్యత్తు కావచ్చు… ఇలా కారణాలు ఏవైనా ఇతర ఉద్యోగాల కన్నా యువతకు ఈ ఉదోగాలంటే ఎంతో ఆకర్షణ. ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నగ్రాడ్యుయేట్లకు భారీ సంఖ్యలో 4252 పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబిపిఎస్) నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ్వ్యాప్తంగా 7 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ అధికారులు/మేనేజ్‌మెంట్ ట్రైనీ (పిఒ/ఎంటి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండంచెల్లో ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి దశలో నిర్వహించే ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రెండవ దశలో మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన నిర్ణీత అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. తగినంత సాధన చేస్తూ, ఆంగ్లంపై పట్టు సాధిస్తే కలల కొలువును చేజిక్కించుకోవచ్చు.

పోస్టుల వివరాలు
ఐబీపీఎస్ – సిఆర్ పిఒ/ఎంటి మొత్తం పోస్టుల సంఖ్య: 4252
బ్యాంకుల వారీ ఖాళీలు : అల్హాబాద్ బ్యాంక్ -784, బ్యాంక్ ఆఫ్ ఇండియా- 965, కెనరా బ్యాంక్- 1200, కార్పొరేషన్ బ్యాంక్- 84, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ – 150, యూసీవో బ్యాంక్ -550, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -519.
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు : 01.08.2018 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1988 – 01.08.1998 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వారి కేటగిరీలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష కేంద్రాలు
తెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు : ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు రూ.100, ఇతరులకు రూ.600.
సబ్జెక్టులు ఐదే
ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 8 విభాగాలున్నా వాటిలో ఉన్నది మాత్రం అయిదు సబ్జెక్టులే. వీటిపై అవగాహన పెంచుకుంటే రెండు పరీక్షలకూ సులువుగా సన్నద్ధమవ్వొచ్చు.
పరీక్షా విధానం
ప్రిలిమినరీలో మూడు విభాగాలుంటాయి. 100 ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కేటాయించిన మొత్తం సమయం 60 నిమిషాలు. ఒక్కో విభాగాన్ని 20 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో మొత్తం అయిదు సబ్జెక్టులతో నాలుగు విభాగాలుంటాయి. విభాగాల వారీగా సమయాన్ని కేటాయించారు. మొత్తం 3 గంట లు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో డిస్క్రిప్టివ్ పేపర్‌కు అదనంగా 30 నిమిషాల వ్యవధి. అంటే మెయిన్స్ మొత్తానికి కేటాయించిన సమయం 3.30గంట లు. అభ్యర్థులు ఈ విభాగాలన్నింటిలో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు గుర్తించిన ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు చొప్పున మార్కులు తగ్గిస్తారు. సరైన సమాధానం తెలియని ప్రశ్నకు సమాధానం గుర్తించకుండా వదిలేస్తే, ఆ ప్రశ్నకు ఎలాంటి మార్కుల తగ్గింపు ఉండదు. ఇంగ్లీష్‌లో ఎక్కువ మార్కులు సాధించగలిగినవారే మిగిలినవారికంటే ముందు వరసలో విజయానికి చేరువలో ఉంటారు.
సబ్జెక్టులు – ప్రశ్నల సరళి
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్/ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ప్రిలిమినరీలోని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లోని ప్రశ్నలు, సింప్లి
ఫికేషన్స్, నంబర్ సిరీస్, డేటా సఫిషియన్సీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, వివిధ అర్థమెటిక్ అంశాల నుంచి వస్తాయి. మెయిన్స్‌లోని డేటా ఇంటర్ ప్రిటేషన్‌లోని ప్రశ్నలు, పట్టికలు, లైన్‌గ్రాఫ్‌లు, బార్ డయాగ్రమ్‌లు, పైచార్టులు, కేస్‌లెట్స్ నుంచి ఎక్కువగా ఉంటాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలను సాధించడానికి పర్సంటేజీ, యావరేజ్, రేషియో- ప్రపోర్షన్, కాల్‌క్యులేషన్స్‌పై పట్టు ఉండాలి. అంతర సంబంధం ఉన్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ గ్రాఫ్‌లను ఇచ్చినపుడు సమాచారాన్ని పట్టిక రూపంలోకి మార్చుకుంటే ప్రశ్నలను త్వరగా సాధించవచ్చు.
రీజనింగ్: మెయిన్స్ పరీక్షలోని ప్రశ్నలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. అనలిటికల్ రీజనింగ్/క్రిటికల్ రీజనింగ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో ప్రశ్నల సంక్షిష్టతతోపాటు ప్రశ్నల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రెండింటిలో ఈ అంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కోడింగ్ -డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రమ్, సిలాజిజమ్, ఇన్‌పుట్- అవుట్‌పుట్, ఎలిజిబిలిటీ టెస్ట్, పజిల్ టెస్ట్, స్టేట్‌మెంట్ సంబంధ ప్రశ్నలు ఉంటాయి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ : చాలా ముఖ్యమైన, ఎక్కువమంది విఫలమవుతున్న విభాగమిది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటితోపాటు మెయిన్స్ పరీక్షలో అదనంగా డిస్క్రిప్టివ్ టెస్ట్‌లోనూ ఈ సబ్జెక్టు ఉంది. గ్రామర్ బాగా చూసుకోవాలి. డిస్క్రిప్టివ్ టెస్ట్‌లోని ఎస్సే, లెటర్ రైటింగ్‌లను బాగా సాధన చేయాలి.
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ : మెయిన్స్‌లో మాత్రమే ఉన్న ఈ విభాగంలో దాదాపు 80% ప్రశ్నలు పరీక్ష సమయానికి 5, 6 నెలల ముందు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ నుంచి ఉంటాయి.
బ్యాంకింగ్, ఆర్థిక సంబంధ విషయాలపైనే ప్రశ్నలు ఎక్కువ. భారత ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, కేంద్రప్రభుత్వ పథకాలు, ఆర్‌బీఐ, స్టాక్ మార్కెట్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ విషయాలు మొదలైనవాటి నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. విషయాలన్నింటినీ క్షుణ్ణం గా తెలుసుకోవాలి, కేవలం ప్రశ్నకు జవాబు అన్న రీతిలో కాకుండా పరిణామాలను విశ్లేషించేలా
సన్నద్ధత ఉండాలి.
కంప్యూటర్ నాలెడ్జ్: ఇది మెయిన్స్‌లో రీజనింగ్‌తో కలిపి ఉన్న సబ్జెక్టు. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, వైరస్-యాంటీ వైరస్, నెట్‌వర్కింగ్, డీబీఎంఎస్, ఈ రంగంలోని తాజా పరిణామాలు మొదలైనవి బాగా చూసుకోవాలి.
రెండు నెలల్లో ప్రిలిమ్స్
ఇదివరకు ఐబిపిఎస్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఈ పరీక్షలకు కొంత అవగాహన ఉంటుంది. రెండవసారి, మూడవసారి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఏమాత్రం నిర్లక్షం చేయకుండా అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకోవాలి. మొదటిసారిగా పరీక్ష రాస్తున్నవారికి సమయం సరిపోతుందా అనే సందేహం వస్తుంది. కచ్చితంగా సరిపోతుంది. ప్రిలిమినరీ పరీక్షకు సుమారు 2 నెలలు, మెయిన్స్‌కు 3 నెలల సమయముంది. కాబట్టి, ముందుగా గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ఏయే అంశాల నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో అర్థమవుతుంది. అన్ని విభాగాల్లో ముందుగా ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్‌లను ఎంచుకుని సాధన చేయాలి. దొరికే సమయాన్నిబట్టి 1-2 ప్రశ్నలు వచ్చే టాపిక్‌లను ఆపై చూడొచ్చు. ప్రిలిమ్స్‌లో ఉన్న విభాగాలన్నీ మెయిన్స్‌లోనూ ఉన్నాయి. కాబట్టి, ఒకే సన్నద్ధత రెండింటికీ సరిపోతుంది. ప్రిలిమ్స్ సమయంలోనే మెయిన్స్ సన్నద్ధత కూడా పూర్తయ్యేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఈ పరీక్ష తరహాలో ఒక మాదిరి ప్రశ్నపత్రాన్ని సాధన చేయాలి. అదేవిధంగా ఆన్‌లైన్ పద్ధతిని కూడా సాధన చేయాలి.

ప్రిలిమినరీని నిర్లక్ష్యం చేయొద్దు
ఐబిపిఎస్ పరీక్షల్లో ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధిస్తేనే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమినరీని ఏమాత్రం నిర్లక్షం చేయొద్దు. ప్రిలిమినరీలోని ప్రశ్నలు సాధారణం నుంచి మధ్యస్థంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మాదిరి ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌లో సాధన చేస్తే మంచిది. ఎక్కువ శాతం ప్రశ్నలు అధిక సమయం తీసుకునేలా ఉంటాయి.కాబట్టి తక్కువసమయాన్ని తీసుకునే వాటిని ముందు గా ఎంచుకోవడంపైనే అభ్యర్థి విజయం ఆధారపడుతుంది. కేటాయించిన సమయంలో వీలైనన్ని ఎక్కువ మార్కులు ప్రతి విభాగం నుంచి పొందగలిగితే మొత్తంగా పరీక్షలో ఎక్కువ మార్కులు పొందొచ్చు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 14 ఆగస్టు 2018
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ : సెప్టెంబర్ 4, 2018
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ : 01.10.2018 నుంచి 07.10.2018 వరకు
ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబరు 13, 14, 20, 21 తేదీల్లో
ప్రిలిమినరీ ఫలితాలు : అక్టోబర్/నవంబర్ 2018
మెయిన్ పరీక్ష: 18.11.2018
మెయిన్స్ ఫలితాలు : డిసెంబర్ 2018
ఇంటర్వ్యూ : జనవరి/ ఫిబ్రవరి 2019
ప్రొవిజినల్ అలాట్‌మెంట్ : ఏప్రిల్ 2019