Home తాజా వార్తలు ఘరానా దొంగా అరెస్ట్…

ఘరానా దొంగా అరెస్ట్…

THEFT

మేడ్చల్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ ఇన్స్‌పెక్టర్ వెంకట్‌రెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేడ్చల్ పట్టణంలో గత ఆరు నెలలుగా జరుగుతున్న వరుస దొంగతనాలను ఛేదించేందుకు విచారణ చేపట్టగా బుధవారం ఉదయం మేడ్చల్ బస్ డిపో సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన షేక్ ఉస్మాన్(48)ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా మేడ్చల్ పరిధిలో ఆరు దొంగతనాలు, మంచిర్యాల పరిధిలో నాలుగు చోరీలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించినట్టు తెలిపారు. నేరస్తుడిపై గతంలో పలు పోలీస్‌ స్టేషన్‌లలో సుమారు 70 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2017 డిసంబర్ లో జైలు నుండి విడుదలైన వెంటనే మళ్ళి వరుస దొంగతనాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. కాగా షేక్ ఉస్మాన్ నుండి 60వేల నగదుతో పాటు 5.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్‌పెక్టర్ వెంకట్ రెడ్డి,  డికెట్టివ్ ఇన్స్‌పెక్టర్ దుర్గప్రసాద్, సిసిఎస్ బాలానగర్ సిబ్బంది తిరుపతి, ఎస్‌ఐ దాసు, సిబ్బంది పాల్గొన్నారు.