Home రంగారెడ్డి దొంగలు బాబోయ్ దొంగలు

దొంగలు బాబోయ్ దొంగలు

man

ఏడాదిలో ఒక్క గ్రామంలోనే 11 ట్రాన్స్‌ఫార్మర్లు మాయం
మండలంలో పాతికకు
పైగా లూఠీ
ఒక్క దొంగనూ పట్టుకోని పోలీసులు

ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులో నుంచి రాగివైరును ఎత్తుకెళ్ళిన దొంగలు పోలీసులకు సవాల్ విసిరి దొంగలు యదేచ్చగా తన పని తాను చేసుకుని పోతున్నారు. సైబారాబాద్ కమీషనరేట్‌కు పక్కన ఉన్న మొయినాబాద్ మండలంలోని ఒక్క గ్రామంలోనే ఎడాదిలో 11 ట్రాన్స్‌ఫార్మర్‌లను పగులకొట్టి అందులోనుంచి రాగి వైరును దొంగలు తస్కరించిన ఇంతవరకు ఒక్క దొంగను కూడ పట్టుకోలేని స్థీతితో మొయినాబాద్ పోలీసులు ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఎడాదిలో 11 ట్రాన్స్‌ఫార్మార్‌లను పగులకొట్టగా, గత రెండు నెలల్లో నాలుగు ట్రాన్స్‌ఫార్మార్‌లు ద్వంసం చేసి అందులో నుంచి రాగి వైరు తీసుకుపోయి మిగత బాక్స్‌లు పడేస్తున్నారు. శనివారం నాడు రాత్రి సైతం గ్రామ శివారులోని ట్రాన్స్‌ఫార్మార్ దొంగల చేతివాటంకు బలైంది. విద్యుత్ సరఫరాతో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌లపై పూర్తి స్థాయి అవగాహన ఉండటంతో ట్రాన్స్‌ఫార్మర్‌కు వచ్చే విద్యుత్ సరఫరా నిలిపివేసి ట్రాన్స్‌ఫార్మర్‌ను క్రిందకు దించి రాగి వైర్లు తొలగించి తీసుకుని పోతున్నారు. మండల పరిధిలోని తోల్‌కట్టా, అప్పారెడ్డిగూడ, కనకమామిడి, నక్కలపల్లి, సజ్జన్‌పల్లి గ్రామాల్లో సైతం గతంలో ట్రాన్స్‌ఫార్మర్‌లను పగులకొట్టి అందులో నుంచి రాగివైర్లు దొంగలు ఎత్తుకుపోతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగలు పగులకొట్టి రాగి వైరు ఎత్తుకుపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లపై దొంగల చేతివాటం అనంతరం రైతులు పైసలు వేసుకుని కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లను కొనుగోలు చేయడానికి నానా ఇబ్బందులు పడుతుండగా ఆలోపు చేతికి వచ్చిన పంట కాస్తా ఎండిపోతుంది. ట్రాన్స్‌ఫార్మర్‌లపై దొంగలు చేతివాటం చూపుతుంటే అడ్డుకోవలసిన అధికారులు మాత్రం ప్రేక్షకపాత్రకు పరిమితం కావడంతో పాటు కనీసం పోలీస్‌లు పిర్యాదు చేయడానికి కూడ ట్రాన్స్‌కో అధికారులు ముందుకు రాకుండా రైతులు పిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. రైతుల పాలిట శాపంగా మారిన ఇలాంటి దొంగలను పట్టుకోవలసిన పోలీసులు ఇతర పనులలో బిజిబిజిగా ఉంటున్నారు. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచు జరుగుతున్న ఇలాంటి దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం చాలా వరకు ఉన్న వారు మాత్రం స్టేషన్‌లలో ఉన్న ఇతర పంచాయతీలలో కాలం గడుపుతున్నారని రైతులు మండిపడుతున్నారు.