Home తాజా వార్తలు కల్వకుర్తిలో దొంగలు బీభత్సం..

కల్వకుర్తిలో దొంగలు బీభత్సం..

Theft by Thieves at Vidyanagar in Huzurabad

హైదరాబాద్:  కల్వకుర్తి పట్టణంలో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఒకే వీధిలో వరుసగా నాలుగు పక్కపక్క ఇళ్లతో పాటు పాలమూరు చౌరస్తాలో కమ్యూనిటీ దవాఖానలోని డాక్టర్స్ క్వార్టర్స్‌లో పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. వివరాలలోకి వెళితే.. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఏదుల శేఖర్ కుటుంబ సభ్యులు వివాహ పనుల నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లగా అతని ఇంట్లో రెండు బీరువాల్లో రూ.3లక్షల నగదు, 15 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులను, అదే కాలనీలో సహదేవ్ ఇంటికి తాళం వేసి మిద్దె మీద పడుకోవడంతో ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 15 తులాల వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. అదే కాలనీలో మంతోజు మంజుల పెండ్లి బట్టల నిమిత్తం వెళ్లడంతో ఆమె ఇంట్లో రూ. 30వేల నగదు, నాలుగు పట్టుచీరలు, పట్టాదారు పుస్తకాలు ఎత్తుకెళ్లారు.

          పాలమూరు చౌరస్తాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ క్వార్టర్స్‌లో ఉంటున్న వైద్యురాలు రమ్యా సౌజన్య  ఇంటి ఆవరణలో ఉన్న కారును దొంగిలించేందుకు ప్రయత్నించగా.. అది విఫలలం కావడంతో వెళ్లి పోయారు. కాగా శుక్రవారం ఉదయం కారు తీసేందుకు వచ్చిన డ్రైవర్ ఇంటి తలుపులు తెరచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డిఎస్పి ఎల్‌సినాయక్, సిఐ శ్రీనివాస్‌రావు, ఎస్ఐ రవి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీకి గురైన ఇళ్లలో డాగ్ స్కాడ్ బృందం చేత తనిఖీలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.