Home నిర్మల్ వృద్ధురాలు దారుణ హత్య

వృద్ధురాలు దారుణ హత్య

Woman-Murder

బాసర (నిర్మల్ జిల్లా): మండల కేంద్రంలోని సిర్గుల్(బి) గ్రామంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకెళ్లి నట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ టి. మహేష్ తెలిపిన వివరాల ప్రకారం మహిళ లింగవ్వ(73) తన ఇంట్లోనే నిద్రించిన వేళ గుర్తు తెలియని దుండగులు ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లి హత్య చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.