Search
Wednesday 21 November 2018
  • :
  • :

విజయవాడలో దొంగల హల్‌చల్

Thieves Hulchul in Vijayawada

విజయవాడ : విజయవాడ దుర్గాపురంలోని బిఆర్‌టిఎస్ రోడ్డులో గురువారం పట్టపగలే దొంగలు హల్‌చల్ చేశారు. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు రాణి అనే మహిళను బంధించారు. ఆమెను కత్తులతో బెదిరించి నగలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో రాణి కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. మరో ఐదుగురు దొంగలు పరారయ్యారు. పట్టుబడిన దొంగలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Thieves Hulchul in Vijayawada

Comments

comments