Home ఖమ్మం నాంధేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ చోరికి యత్నం

నాంధేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ చోరికి యత్నం

thives in nandhed expressఖమ్మంః బోనకల్-రామాపురం గ్రామాల మధ్య గల రామాపురం రైల్వే గేటు సమీపంలోని 510వ మైలురాయి వద్ద గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో విశాఖపట్నం నుండి నాంధేడ్ వెళ్తున్న నాంధేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ రైలు వారానికి ఒక్కసారి విశాఖపట్నం నుండి నాందేడ్ వెళ్తుంది.రైలులో బందోబస్తు ఉండకపోవడంతో అదును చూసి దోంగలు పక్కా ప్రణాళికతో చోరికి పాల్పడ్డారు. దుండగులు రైలులో చైన్‌లాగి 8మంది మహిళల మెడలో ఉన్న 12తులాల బంగారు అభరణాలను ఎత్తుకెళ్ళారు. సంఘటన స్ధలాన్ని గురువారం వైరా డిఎస్‌పి భుక్యా రాంరెడ్డి, ఖమ్మం జిఆర్‌పి ఎస్‌ఐ రవిరాజు, బోనకల్ ఎస్‌ఐ కుమారస్వామిలు డాగ్‌స్కాడ్ బృందంతో పరిశీలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం…….ఎస్7బోగిలో బెర్త్ నెంబర్9లో ప్రయాణిస్తున్న విశాఖపట్నంకు చెందిన ఎపిఎస్‌పి కానిస్టేబుల్ పి.లక్ష్మణరావు భార్యకు చెందిన రెండున్నర తులాల పుస్తేల తాడు, ఎస్ 8 బొగి బెర్త్ నెంబర్20లో ప్రయాణిస్తున్న నాగర్‌కర్నూలుకు చెందిన కొప్పునూరి చెన్నమ్మ నాలుగున్నర తులాల పుస్తెల తాడు,ఎస్ 9 బెర్త్ నెంబర్12లో ప్రయాణిస్తున్న విశాఖపట్నం గాజువాక కుచెందిన ఈటె శంకుతల రెండున్నర తులాల పుస్తెల తాడు, ఎస్9 బెర్త్ నెంబర్ 6లో ప్రయాణిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన పిసిరి లక్ష్మి రెండున్నర తులాల పుస్తెల తాడు, ఎస్10 బెర్త్ నెంబర్25లో ప్రయాణిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన ఎల్ సావిత్రి 4తులాల పుస్తెలతాడు, ఎస్4లో బెర్త్ నెంబర్4లో ప్రయాణిస్తున్న ఉప్పల్‌కు చెందిన శరం బాలమణి 3కాసుల పుస్తెల తాడు, ఎస్ 4లో ప్రయాణిస్తున్న నిజామాబాద్‌కు చెందిన డి మాలతి గిల్టీ నగలు,ఎస్ 3బోగిలో ప్రయాణిస్తున్న బి లక్ష్మి విశాఖపట్నంకు చెందిన మహిళ గిల్టీనగలు, తాడు ,నక్లెస్, చెవుదిద్దులు దుండగులు అపహరించారు. రైలులోని ఎస్4 బోగినుండి ఎస్10 బోగిలలోని మహిళల అభరణాలను దోంగిలించినట్లు వారు తెలిపారు. దొంగలు 10మంది వరకు ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఆంద్రా ,తెలంగాణా సరిహద్దు ప్రాంతం కావడం కొద్ది దూరంలోనే ప్రధాన రహదారి ఉండటంతో దుండగులు తేలికగా తప్పించుకునేందుకు అస్కారం ఉంది. దీనికి తోడు రైలులో ఎటువంటి రైల్వే పోలీసు బందోబస్తు లేకపోవడంతో వారి పని సులువుగా మారింది. భాదితులు ముందుగా ఖమ్మం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చి అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.