Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

4.50 కోట్ల చేప పిల్లలు

 Third installment of the fish farm in Medak district

మెదక్ జిల్లాలో మూడో విడత చేప పిల్లల పెంపకానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో జిల్లా మత్యశాఖ అధికారులు చేప పిల్లల విత్తన సరఫరాకు ప్రణాళికను ఖరారు చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మెదక్ జిల్లాలో 4.50 కోట్ల చేప పిల్లలు పెంచేందుకు లక్ష్యాన్ని మత్సశాఖ ఖరారు చేసింది. జిల్లాకు అవ సరమైన చేప విత్తన సరఫరాకు టెండర్లు కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మన తెలంగాణ అందిస్తోన్న ప్రత్యేక కథనం..

మన తెలంగాణ/పెద్దశంకరంపేట : చేప పిల్లలకు సంబంధించి విత్తన ఎంపిక టెండర్లు ఖరారయ్యాయి. ఈ సంవత్సరం మెదక్ జిల్లాలో దాదాపు 4.50కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. రాయితీపై సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత రెండు రోజులుగా జిల్లాలో తొలకరి వర్షాలు కరుస్తున్నాయి. మృగశిర కార్తె కూడా గత రెండు  రోజుల కిందటే వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురుస్తూ నీటి వనరుల్లోకి నీళ్లు వస్తున్నాయి. చేప పిల్లల పెంపకానికి అనువై న నీటి వనరులను గుర్తించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ప్రభు త్వం మత్స పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించింది. కుల వృత్తులకు చేయూత అందించడంలో భాగంగా వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇందులో భాగంగా మత్స పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. మత్సకారులను ఆర్థికంగా పరిపుష్టి చేయడం కోసం ప్రభుత్వం గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి వారి కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టింది. 2015-16 సం వత్సరం నుంచి చేపల పెంపకం చేపట్టి ప్రాథమిక మత్స సహకార సంఘాలకు వంద శాతం రాయితీపై చేప విత్తనం సరఫరా చేస్తోంది. మత్స పరిశ్రమ బాగా విస్తరించి ఉన్న మెదక్ జిల్లాలో ప్రభుత్వ విధాన నిర్ణయం మత్సకారులకు వరంలా మారింది. రాష్ట్రం ఏర్పడక ముందు మెదక్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిస్థితులను తట్టుకుని మత్సకారులు ఆర్థికంగా నిలదోక్కుకునేందుకు తీవ్ర కృషి చేయాల్సి వచ్చింది. నీటి వనరులు నిండక పోవడంతో చేపల పెంపకం ఒక శాపంలా మారింది. ఒక్కొక్క సారి వర్షాలు కురిసినా చెరువులు నిండినా చేప పిల్లల విత్తనం కోసం ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారులు రాజ్యమేలారు. ఈ వ్యవస్థను సమూలంగా ని ర్మూలించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల విత్తన సరఫరాను చేపట్టింది.  జిల్లాలోని 471 చెరువుల్లో  దాదాపు 2.49 కోట్ల చేప పిల్లలను వదిలారు. ఇప్పటివరకు మత్స శాఖ పరిధిలోని జలాశయాలు, నీటి పారుదల శాఖ పరిధిలోని చెరువుల్లో మాత్రమే రాయితీ చేప పిల్లలను వదిలేవారు. తాజాగా ఈ సారి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువుల్లో సైతం రాయితీ చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం  నిర్ణయించిం ది. 2018-19 ఆర్థికసంవత్సరానికి గానూ మత్సశాఖ ఇప్పటికే చెరువుల పెంపకం కోసం అనువైన గ్రామ పంచాయతీ చెరువులను  గుర్తించింది. మెదక్ జిల్లా  పరిధిలో పోచారం, హాల్దీ, ఘనపూర్ జలాశయాలు, నీటి పారుదల శాఖ పరిధిలో 317 చెరువులు ఉన్నాయి. వీటితో పాటు గ్రామ పంచాయతీ పరిధిలోని 1274 చెరువులు కలుపుకుని మొత్తం 1591 నీటి వనరులున్నాయి. ఆయా వనరులన్నీంటిలోనూ చేపలు పెంచేందుకు 4.50 కోట్ల చేప పిల్లల (విత్తనం) అవసరం ఉంటుందని అంచనా వేశా రు. గతంలో గ్రామ పంచాయతీ నీటి వనరులను పరిగణనలోకి తీసుకునే వారు కారు. ఈ సారి నుంచే కొత్తగా గ్రామ పంచాయతీ నీటి వనరులను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ సీజన్‌లోనే 35-40 మిల్లీలీటర్ల పరిమాణం ఉండే 20 లక్షల చేప పిల్లలను మెదక్‌లోని మత్సశాఖ క్షేత్రంలో ఉత్పత్తి చేయాలని మత్సశాఖ ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అవి మినహా మిగిలిన చేప పిల్లలను టెండ రు ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మెదక్ జిల్లాలో నేటి వరకు 5,000 టన్నులు దిగుబడులు వచ్చాయని అధికారిక లెక్కలు చెబుతున్నా యి. వీటి ద్వారా దాదాపు రూ.30 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది.

2017-18 ఆర్థిక సంవత్సరంలో చేపల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. 5-6 నెలలకు మించి నీరుండే చెరువుల్లో అయితేనే చేప లు బాగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు నీటి నిల్వ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని అనువైన వనరుల్లోని చేప విత్తనాన్ని వదిలారు. జిల్లా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బొచ్చ, రోహు, రకాల చేప విత్తనాన్ని వదలగా అనుకూల వాతావరణం ఉండటం, రోగాలు సోకకపోవడం వల్ల చేపలు బాగా ఎదిగాయి. వదిలిన విత్తనాన్ని బట్టి 6వేల టన్నుల చేపల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని నీటి వనరుల ద్వారా సుమారు 5వేల టన్నుల చేపల దిగుబడి వచ్చిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం పాపన్నపేట, చిన్న శంకరంపేట,పెద్దశంకరంపేట మండల్లాలోని వివిధ గ్రామాల్లో చేపలు పట్టే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కిలో ధర సరాసరి రూ.60 అనుకున్నా ఇప్ప టి వరకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన దిగుబడిని బట్టి చూస్తే దాదాపు రూ.30 కోట్ల విలువైన మత్స సంపద జిల్లా మత్సాకారులకు దక్కిందని పలువురు చెబుతున్నారు.

Comments

comments