Home తాజా వార్తలు మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

Jenninga

ముంబయి: వాంఖడే స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 87 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జెన్నింగ్స్, అలీ డకౌట్ రూపంలో ఔటయ్యారు. కుక్ 18 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యుగా వెనుదిరిగారు. భారత్ బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో రూట్ (51), బయిర్ స్టో (9) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 400

భారత్ తొలి ఇన్నింగ్స్: 631