Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

ఇంటర్‌నెట్ హీరో..

Dog-is-Internet-Hero

పోన్చో అనే పేరుగల పోలీస్ కుక్క ఇప్పుడు ఇంటర్ నెట్‌లో హీరో అయ్యింది. ఒక ప్రాక్టీస్ డెమానిస్ట్రేషన్‌లో పోన్చో చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకి బోలెడన్ని లైకులూ షేర్‌లూను. ఇంతకీ అదేం చేసిందంటే…గ్రౌండ్‌లో విన్యాసం చేస్తున్న ఓ అధికారి ఉన్నట్లుండి పడిపోతాడు. అంతే అతను ట్రైనింగ్ ఇచ్చిన కుక్క పరుగుపరుగున వచ్చి, పడిపోయిన తన యజమానిని గమనిస్తుంది. అంతే ఎంతో తెలివిగా అతని గుండెలపై ఎగిరెగిరి పడుతూ ఊపిరి అందేలా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆఫీసర్ గుండెకు తల ఉంచి చెక్ చేస్తుంటుంది. ఇలా ఒకసారి కాదు అనేకసార్లు చేస్తుంది. అంటే ఫస్ట్‌ఎయిడ్ చేస్తుందన్నమాట. ఇంత లో ఈ విన్యాసం చూస్తున్న ప్రేక్షకుల నుంచి చప్పట్లు. పోన్చోను ఆప్యాయంగా ఆఫీసర్ దగ్గర తీసుకోవడంతో కథ సమాప్తమౌతుంది. ఇదంతా ఆ కుక్కను పరీక్షించడానికి ఆఫీసర్ ఆడిన నాటకమన్నమాట. ఈ సరదా వీడియోని ఆ అధికారి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దాన్ని షేర్ చేసుకున్న హ్యుమనిస్ట్, రచయిత జోష్ బిల్లింగ్  ప్రపంచంలో కుక్క మాత్రమే మనుష్యులను అమితంగా ప్రేమిస్తుంది. తనకంటే ఎక్కువగా అదీను…అంటూ ఓ ట్యాగ్ లైన్‌ను పెట్టాడు.

Comments

comments