Home జాతీయ వార్తలు విఐపి సంస్కృతికి చరమగీతం

విఐపి సంస్కృతికి చరమగీతం

  • ప్రముఖుల కన్నా సాధారణ పౌరులే ముఖ్యం : ‘మన్ కీ బాత్’ లో ప్రధాని మోడీ

mann-ki-baat

న్యూఢిల్లీ: వీఐపీలకంటే దేశంలో సాధారణ పౌరులే ముఖ్యం అని ప్రధాని నరేంద్రమోడీ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతి ఒక్క పౌరుడూ ముఖ్యమైన వ్యక్తేనని.. అందుకే వీఐపీల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగిం చాలని నిర్ణయించామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ఆదివారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘నవ భారతం అనే మా విధానానికి అర్థం వీఐపీల స్థానంలో ఈపీఐకి ప్రాధా న్యత పెంచడమే అని, దీని అర్ధం ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో గొప్పదనం ఉంది. 31వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈపీఐ అంటే ‘ఎవ్విరి పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్(ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే)’ అని వివరించారు. అందుకే వీఐపీ సంస్కృతి స్థానంలో ఈపీఐ(ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్) కల్చర్ తీసుకొస్తున్నామని తెలిపారు. వీఐ పీలకు చిహ్నంగా ఉన్న తమ కార్లపై ఉండే ఎరుపు బుగ్గలను తొలగించడం, అనేది వ్యవస్థను ఆధునీకరించడంలో భాగమని, అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమ మనసుల నుంచి వీఐపీలం అనే ఆలోచనను తొలగించే ప్రయ త్నం చేయాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. వీఐపీ సంస్కృతి మన దేశానికి శాపమని మోడీ చెప్పారు. తన అనుభవం నేర్పిన విషయాన్ని వివరి స్తూ వాహనాలపై ఎర్రబుగ్గలను పెట్టినప్పటికీ, జనం మనసుల్లోకి చొరబడ్డా యని, తద్వారా వీఐపీ సంస్కృతికి మారిందిని తెలిపారు. జనం మనస్సులో ఉన్న ఎర్రబుగ్గలు కూడా పోవాలన్నారు. 125 మంది ప్రజల గొప్పదనాన్ని మేం స్వీకరిస్తాం.’ అని అన్నారు. ప్రతి వ్యక్తి ముఖ్యమైన వాడేనని, 125 కోట్ల భారతీయులందరూ ముఖ్యమైనవారేనని తెలిపారు.మనమంతా కలిస్తే అ త్యంత సంక్లిష్టమైన కలలను కూడా సాకారం చేసుకోగల్గుతామన్నారు. గొప్ప పనులు చేయాలని, కలలు కనడం గొప్ప విషయమని మోడీ తెలిపారు. అయి తే మానవీయతకు విఘాతం కలుగకూడదని చెప్పారు. మనం మానవీయ వి లువల నుంచి పక్కకు వైదొలగకూడదన్నారు. భగవద్ రామానుజాచార్య స సాహ్రబ్దిని నిర్వహించుకోవడం సంతోషకరమని ప్రధాని నరేంద్ర మోడీ చె ప్పారు. సమాజ అభివృద్ధికి, సాంఘిక సమానత్వం కోసం రామాను జాచార్య ఎంతో కృషి చేశారన్నారు. మే 5న భారత్ సౌత్ ఏసియా వాటిలైట్‌ను ప్రారం భించబోతోందని, అది భారత్‌కు ముఖ్యమైన ముందడుగని దాని ద్వారా మొ త్తం సౌత్ ఆసియాతో సహాయసహకారాలు పెంపొందించుకోవచ్చిన అన్నారు.
సద్వినియోగం చేసుకోండి : విద్యార్ధులకు ప్రధాని పిలుపు
వేసవి సెలవుల్లో కొత్త అనుభావాలను సంపాదించుకోవాలని విద్యార్థులకు పి లుపునిచ్చారు. గిరిగీసుకుని కూర్చోకుండా, సెలవుల్లో బయటకెళ్ళి సమీపం లో ఉన్న పిల్లలతో ఆటలు ఆడుకోవాలని సలహా ఇచ్చారు. ఆటలపై దృష్టి పె ట్టండి. ఇంటి నుంచి బయటికి వెళ్లి మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలతో ఆడుకోండి. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని విద్యార్ధులకు తెలిపారు. కొత్త ప్రాంతాలకు వెళ్ళడం వల్లసరికొత్త అనుభవాలను సొంతం చేసుకోవచ్చునని తెలిపారు. నూతన నైపుణ్యాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని తెలి పారు. మన్ కీ బాత్ కోసం సలహాలు అడిగినప్పుడు చిన్నారులు చాలా మంది స్పందించారని, వేసవికాలం గురించి ఎక్కువ మంది రాశారని మోడీ చెప్పా రు. మీ పరిధులు దాటి బయటకు వచ్చి ఏదైనా చేయండి. మాతృభాషతో పాటు మరో కొత్త భాషను నేర్చుకోండి. డ్రాయింగ్, కొలనులో ఈత నేర్చుకోం డని కూడా విద్యార్ధులకు ఉపదేశం చేశారు. పక్షుల దాహం తీర్చేందుకు తాము నీళ్ళు అందుబాటులో ఉంచుతున్నామని కొందరు చెప్పడం సంతో షంగా ఉందన్నారు. కొద్ది రోజుల క్రితం జగత్ కింకాబ్వాలా తనకు లేక రాశా రని, ఆయన పిచ్చకలను కాపాడడానికి పడిన శ్రమను వివరించారని చెప్పా రు. అటువంటి ప్రయత్నాలను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ వేసవిలో పక్షులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోండి. ఇందుకోసం చిన్నారులు పాత్రల ద్వారా నీటిని పక్షులకు అందుబాటులో ఉంచండి అని విద్యార్థులకు సూచించారు. పోస్టుమ్యాన్, పాలు, కూరగాయలు అమ్మే వ్యక్తులు మన ఇంటి కి తరచూ వస్తూ ఉంటారు. ఈ వేసవిలో వారు ఇంటికి వచ్చినప్పుడు నీరు తాగుతారా అని అడగడం మర్చిపోవద్దు అని విద్యార్ధులను కోరారు. యువ స్నేహితుల్లారా… ఈ వేసవి సెలవుల్లో నైపుణ్యాభివృద్ధి సాధించండి. కొత్త ప్రదే శాలకు వెళ్లండి. కొత్త కొత్త అనుభవాలు సంపాదించుకోండి అని పిలుపుని చ్చారు. కొత్త భారత్‌ను తీర్చిదిద్దే క్రమంలో అందరం భాగస్వామ్యమవుదాం.
ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మోడీ పలు విషయాలను స్పృషించారు. ప్రజలు చాలా విషయాలు తన దృష్టికి తీసుకొస్తున్నారని, వారి నుంచి వచ్చిన సలహాలు స్వీకరిస్తానని అన్నారు.