Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రణ్‌బీర్‌తో ఇదే ఆఖరి సినిమా : కత్రినా కైఫ్

Ranbir-kapoor-katrina-kaif

ముంబయి : రణబీర్ కపూర్‌తో కత్రినా కైఫ్ నటిస్తున్న సినిమా జగ్గా జాసూస్. ఈ సినిమా తరువాత అతడితో ఏ సినిమాలోనూ కలిసి నటించనని, ఇదే అతడితో నటించే ఆఖరి సినిమా అని కత్రినా కైఫ్ తేల్చి చెప్పారు. జగ్గా జాసూస్ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. రణబీర్‌తో కలిసి పని చేయడం చాలా కష్టంగా అనిపించిందని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలోనే తనతో మరో సినిమాలో నటించనని రణబీర్ చెప్పాడని, దీంతో తాను కూడా అతనితో మరే సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నట్టు కత్రినా వెల్లడించింది. అయితే ఈ విషయమై రణబీర్‌ను మీడియా అడిగితే, ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాడు. హిందీలో వీరిద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు. రణబీర్, కత్రినా 2011లో ప్రేమించుకున్నారు. ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఒకే అపార్ట్‌మెంట్‌లో కలిసి కూడా ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల 2016 జనవరిలో వీరు విడిపోయారు.

This is the last film with Ranbir: Katrina Kaif

Comments

comments