Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

తప్పు చేస్తే మద్యంసీసా ఇవ్వాల్సిందే…

 liquor  fine for every crime

ధన్‌బాద్:  గొడవ పెట్టుకుంటే రెండు బాటిళ్లు, దొంగతనం చేస్తే ఐదు బాటిళ్లు, ఇంకా తీవ్రమైన నేరం చేస్తే జరిమానా పది బాటిళ్ల వరకు ఉంటుంది. ఈ బాటిళ్ల గోలేంటి అనుకుంటున్నారా. అవన్నీ మద్యం బాటిళ్లు. గతవారం దాలు అనే వ్యక్తి పొరుగింటి వ్యక్తితో గొడవ పెట్టుకున్నాడు. అందుకు అతడికి పడిన శిక్ష ఏంటో తెలుసా..? రెండు బాటిళ్ల మద్యం. అతడిని దోషిగా తేల్చిందేమో అక్కడి కమ్యూనిటీ పెద్ద. ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఝార్ఖండ్‌లోని చల్కారీ గ్రామంలోని బిర్హోర్‌ తెగలో ఇలాంటి నిర్ణయాలే శాంతి భద్రతలకు, సంఘ జీవనానికి కారణమవుతున్నాయి. అక్కడి కమ్యూనిటీ కోర్టు ఎవరినైనా దోషిగా తేలిస్తే వారికి కచ్చితంగా మద్యం‌ జరిమానాగా విధిస్తారు. ఆ మద్యం పేరు హరియా. చేసిన నేరాన్ని బట్టి రెండు నుంచి పది బాటిళ్ల వరకు హరియాను జరిమానాగా కట్టాల్సి ఉంటుంది.

 

 

Comments

comments