Search
Wednesday 21 November 2018
  • :
  • :

నోట్ల రద్దు తో ఈ ఓలా క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడంటే…?

Ola-Cab-Driver

నోట్ల రద్దు ఇష్యూ ఇప్పుడు దేశంలో చాలా పెద్ద సమస్యగా మారింది. చాలా మంది పెద్ద నోట్ల ను మార్చుకోవడానికి పొద్దటి నుంచే బ్యాంకుల వద్ద కుస్తీ పడుతున్నారు. చాలామంది వెయిట్ చేసి, వెయిట్ చేసి డబ్బులు అయిపోగానే వెనుదిరుగుతున్నారు.

మోడీ నోట్ల రద్దు గురించి ప్రకటించక ముందే చాలా మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. అప్పుడు చాలా మంది దగ్గర రద్దైన నోట్లే ఉన్నాయి. కాని, వాటిని ఉపయోగించలేరు. అటువంటి పరిస్థితే ఓ వ్యక్తి కి ఎదురైంది.

ఢిల్లీలో ఓలా క్యాబ్ లో రైల్వే స్టేషన్ కు ప్రయాణిస్తున్నాడు విప్లవ్ అరోరా అనే వ్యక్తి. అయితే, అప్పటికే నోట్ల రద్దు విషయం అతడికి తెలిసినప్పటికీ… ఓలా అకౌంట్ లో డబ్బులు ఉండటంతో లైట్ తీసుకున్నాడు.

క్యాబ్ లో ప్రయాణించాడు, దిగే ముందు బిల్లు చూస్తే అకౌంట్ లో ఉన్నదానికంటే ఎక్కువే అయింది. అంతే, మనోడి దగ్గర మాత్రం ఉంది అంతా రూ. 500, 1000 నోట్లే. ఇక, ఏం చేయాలో తెలియక తికమక పడుతున్న అతడి పరిస్థితిని గమనించిన ఓలా క్యాబ్ డ్రైవర్ “….పర్లేదు సార్.. చేంజ్ లేకుంటమాయె… ప్రధాని సాబ్ మన దేశానికి ఏదో మంచి చేయడానికి ఇదంతా చేస్తుండు… దేశం కోసం ఆ డబ్బును నేనే ఇచ్చాననుకుంటాను….మీకు ట్రైన్ టైమ్ అవుతుంది.. వెళ్లండి.. బాధ పడకండి… ” అని అన్నాడట అంతే.

ఓ క్యాబ్ డ్రైవర్ అయినప్పటికీ, ఎంత గొప్పగా మాట్లాడాడు. అతడి మాటలు విన్న విప్లవ్ చలించిపోయాడట.. వెంటనే ఓలా ఫేస్ బుక్ పేజీలో ఈ ఘటన గురించి వివరించాడట.

వెంటనే ఓలా స్పందించి, అటువంటి డ్రైవర్ ఓలాతో పనిచేయడం తమ అదృష్టమని… ఎక్స్ ట్రా అమౌంట్ ను కంపెనీయే డ్రైవర్ కు పే చేస్తుందని విప్లవ్ కు ఓలా హామీ ఇచ్చిందట.

ఈ విషయం మోడీ సాబ్ కు తెలిస్తే ఎంత హ్యాపీ గా ఫీలవుతాడో కదా…

Comments

comments