Home జాతీయ వార్తలు దేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు: ప్రధాని

దేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు: ప్రధాని

 

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని అందించిన దేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. ఈ ఘన విజయం దేశ ప్రజలకు అంకితమిస్తున్నానని తెలిపారు. 130 కోట్ల మంది ప్రజలు దేశం పక్షాన నిలిచారని, దేశం బాగు కోసం  వెల్లువలా తరలివచ్చి బిజెపికి ఓటేశారన్నారు. ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల జరిగినా..ఇంతటి ఘనవిజయం దక్కలేదన్నారు. కష్టాలకు వెనకడుగు వేయని పార్టీ శ్రేణులను చూసి గర్విస్తున్నానన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని చెప్పారు.  పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఇసి, భద్రతా బలగాలు, ప్రజలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.

This victory dedicated to our country: PM Modi