Home మంచిర్యాల ఖరీఫ్ సాగుకు రైతున్నల సమాయత్తం

ఖరీఫ్ సాగుకు రైతున్నల సమాయత్తం

This year's pre-monsoon winds

ఈ ఏడాది ముందస్తుగానే రుతు పవనాలు
సాగుకు శ్రీకారం చుట్టిన రైతులు ఖరీఫ్ సీజన్‌కు యాక్షన్ ప్లాన్ సిద్ధం
రైతుబంధు కింద రూ.108.02కోట్ల చెక్కుల పంపిణీ-
అందుబాటులోనే మందులు, ఎరువులు

మనతెలంగాణ/మంచిర్యాల: రైతన్నలు ఖరీఫ్ సాగుకు సన్నద్దమయ్యారు. దుక్కులు దున్నుతూ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఆశించినట్లుగానే ఈఏడాది ముందుగా రుతుపవనాలు రాగా చిరు జల్లులతో రైతులు పొలంబాట పట్టారు. ప్రభు త్వం రైతు బంధు కార్యక్రమం కింద అందించిన పెట్టుబడి సాయంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశారు. గతంలో పంటల పెట్టుబడులకోసం రైతులువడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వారు కాగా రైతు బంధుపథకం అన్నదాతకు ఆర్థికంగా చేయుతనిచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే ఖరీఫ్ పంట లక్షాలను సిద్దం చేశారు. ప్రభుత్వ సాయంతో జిల్లాలోని అన్ని మండలాల్లో గత ఏడాది కన్న సాగు విస్తీర్ణాన్ని 10వేల ఎకరాల్లో పెంచేందుకు రైతులు సన్నాహాలు చేస్తు న్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా యంత్రాంగం పంట రుణాల ప్రణాళికలను ఖరారు చేసింది. ఈ ఏడాది రూ. 1,373,69 కోట్ల రుణాలను జిల్లాలోని రైతులకు పంట రుణాలుగా అందించేందుకు బ్యాంక్‌లు ముందుకు సాగుతున్నాయి. పంటసాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందు వలన బ్యాంకర్లుకూడా ఖరీఫ్ సీజన్‌లో రుణ లక్షాన్ని పెంచారు. ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ సాగును పెంచేందుకు అధికారులు సైతం యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు. మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్దమై భూములను చదును చేసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో సాగు లక్షం 2.65 లక్షల ఎకరాలు కాగా 1.30 లక్షల మందికి పైగానే రైతులు పంటలు పండిస్తున్నారు. 23,610 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు 80,727 మెట్రిక్ టన్నుల ఎరువులు లక్షంగా పెట్టుకొని అధికారులు తెపించేందుకు కసరత్తులు చేస్తున్నారు. పంట రుణాల లక్షం 122 కోట్లు కాగా రైతు బంధు పథకం కింద రూ.108 విలువ గల 1,11,058 చెక్కులను పంపిణీ చేశారు.ఖరీఫ్‌లో 1,13,317 ఎకరాల్లో వరి, 1,39,410 ఎకరాల్లో పత్తి పంటలు, 6297 ఎకరాల్లో కందులు, 8,439 ఎకరాల్లో మక్కజొన్న సాగు చేసేందుకు అధికారులు ప్రణాళి కలు సిద్దం చేశారు. 28 వేల క్వింటాళ్ల వరి ధాన్యం 1.40 లక్షల పత్తి విత్తనాల ప్యాకేట్లు, 300 క్వింటాళ్ల కందులు తెపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌కు గాను వ్యవసాయ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు. జిల్లాలో 97,772 మంది రైతులు 1.32 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. 70 వేల హెక్టార్లలో పత్తి,40 హెక్టార్లలలో వరి, కంది, పెసర పంటలను పండిస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే రైతు బంధు పథకం కింద వ్యవసాయ పెట్టుబడుల రూపంలో ఎకరానికి రూ.4 వేలు అందడంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వం అందించిన పంట పెట్టుబడి సాయం అందుకున్న రైతన్నలు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.