Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సదాశివపేటలో దొంగల బీభత్సం..

Thives Stolen In BSNL Employee House In Sadhashivapet

సదాశివపేట రూరల్ : రోజుకో రీతిలో దొంగలు బీభత్సం సృష్టిస్తూ తమదైన శైలిలో దొంగతనానికి పాల్పడుతున్నారు. మరణాయుదాలతో ఇంట్లో ఎవరు లేని సమయాన్ని గమనించి ఆ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి సులువుగా తమ పని కానిచ్చేస్తున్నారు. సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి శివయ్య బంధువుల పెళ్లి నిమిత్తం ఇంటికి తాళం వేసి ఊరెళ్లగా…ఆయన ఇంట్లో శనివారం దొంగతనం జరిగింది. సదాశివపేట సిఐ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురునగర్ కాలనీలోని శివయ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు 4 తులాల బంగారం, 20 తులాల వెండి , 50వేల నగదు ఎత్తుకెళ్లినట్లు సిఐ తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకున్న శివయ్యతో పాటు కుటుంబసభ్యులు ఇంటిని పగులగొట్టి బీరువ తలపులు తీసి ఇల్లు చిందరవందరగా ఉన్న విషయాన్ని గమనించి దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments