Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

యేసు క్రీస్తు జీవితంపై…

Jesusసువర్ణ క్రియేషన్స్ పతాకంపై బేబీ మేరి విజయ సమర్పణలో వస్తున్న చిత్రం ‘తొలి కిరణం’. యేసు క్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా వినూత్నంగా నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చేయనున్నారు. శుక్రవా రం దర్శకుడు జె.జాన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సాగర్, బెనర్జీతో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా జాన్‌బాబు మాట్లాడుతూ “ఈ చిత్రా న్ని చాలా కష్టపడి నిర్మించాం. ఇందులో 45 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయి. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి డిసెంబర్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాం”అని అన్నారు. యేసుక్రీస్తుగా నటించిన పి.డి.రాజు మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం నటుడిగా నాకు మంచి పేరును తీసుకువస్తుంది”అని తెలిపారు. బెనర్జీ మాట్లాడుతూ “యేసు క్రీస్తు జీవితంపై చక్కగా తెరకెక్కించిన చిత్రమిది. సినిమాను చాలా సహజంగా తీశారు”అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరాః ఎం.మురళి, సంగీతంః ఆర్.పి.పట్నాయక్, పాటలుః చంద్రబోస్, కథ, మాటలుః విఎంఎం ప్రణీత, ప్రభుకిరణ్.

Comments

comments