Home సినిమా అలాంటి రికార్డులు విజయ్ దేవరకొండకే సాధ్యం

అలాంటి రికార్డులు విజయ్ దేవరకొండకే సాధ్యం

Notaవిజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం ‘నోటా’. ఈ చిత్రం ఈనెల 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘నోటా పబ్లిక్‌మీట్’ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ “ఇంత మంచి పవర్‌ఫుల్ సినిమా తీసిన దర్శకుడు ఆనంద్ శంకర్‌కు ఆల్ ది బెస్ట్. విజయ్ దేవరకొండ తన మొదటి సినిమా నుంచి చూపిస్తున్న వేరియేషన్స్ బాగున్నాయి. ఏ హీరోకైనా ఇలాంటి అభిమానం చాలా అరుదు. అది విజయ్‌కి దక్కింది. ‘నోటా’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను”అని అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ “పెళ్లిచూపులు సినిమా చూసినప్పుడు విజయ్ దేవరకొండ కోసం ఒక స్క్రిప్టు రాయాల నుకున్నాను. ఆతర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఇప్పుడు నోటా… ఇవన్నీ చూస్తుంటే మంచి స్క్రిప్టుతో విజయ్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. తప్పకుండా ఒక మంచి స్క్రిప్టుతో అతనితో సినిమా చేస్తాను”అని పేర్కొన్నారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ “విజయ్ నటించిన ‘గీత గోవిందం’ సినిమాను తమిళనాడులో విడుదల చేశాం. అద్భుతమైన స్పందన వచ్చి నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది ఈ సినిమా. ఇలాంటి రికార్డులు విజయ్‌కే సాధ్యం. మరి ‘నోటా’తో అతను ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి”అని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “తెలంగాణలో ఎన్నికల సమయంలో ఈ సినిమా వస్తుండడంతో… ఒక పార్టీకి మద్దతుగా ఈ సినిమా ఉంటుందని కొందరు ఆరోపిస్తున్నారు. అలాంటివి ఏమీ ఈ సినిమాలో లేవు. ఇది పూర్తిగా డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిన సినిమా. అయినా సినిమా చూసి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరు.