Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

హెచ్‌ఎండిఎపై శివారు నేతల ఒత్తిళ్లు!

Threats to give road contracts to villages

గ్రామాల రోడ్ల కాంట్రాక్టులు ఇవ్వాలని బెదిరింపులు
వినకపోతే రోడ్లలో నాణ్యత లేదంటూ విమర్శలు
థర్డ్‌పార్టీతో పరీక్ష చేయాలంటూ సూచనలు
తాత్కాలికంగా నిలిచిపోనున్న పనులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: రోడ్లు సరిగా వేయడం లేదు… ఏర్పాటులో నాణ్యత తగ్గుతోంది… రెగ్యులర్‌గా చేసే మా కాంట్రాక్టర్లైతే బాగా వేస్తారు… మా వారికే పనులు ఇవ్వచ్చుగదా…? ఇదీ నగర శి వారు గ్రామాల్లో హెచ్‌ఎండిఏ చేపడుతున్న రోడ్లపై అక్కడి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు. శివారు ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు మెరుగవుతాయని, అక్కడి రోడ్ల సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మ ంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు హెచ్‌ఎండిఎ రహదారులను అభివృద్ధి పరుస్తున్నది. రోడ్ల నిర్మాణంతో ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజాప్రతినిధులకు మంచి పేరు వస్తుందని, ప్రజలకు సదుపాయం కల్పించినట్టుగా ఉంటుందనేది అథారిటీ భావన. దీనికి తోడు రహదారుల వసతి మెరుగైతే అథారిటీకి లేఅవుట్లు, భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతుల మంజూరుకు ధరఖాస్తులు పెరుగుతాయని, తద్వారా ఆదాయ ం చేకూరుతుందనేది సంస్థ అభిప్రాయం. అయితే, న గర శివారు ప్రజాప్రతినిధులు ఆ రోడ్ల పనులను ము ందుకు సాగకుండా పరోక్షంగా, ప్రత్యక్షంగా మోకాలడ్డేస్తున్నారనేది బహిరంగరహాస్యం. ఆ పనులు తమకు మద్దతుగా ఉండే కాంట్రాక్టర్లకు ఇస్తే తమకు ప్రయోజనకరంగా ఉంటుందనేది పరోక్షంగా అధికార వర్గాల వద్ద ప్రస్తావిస్తున్నట్టు అథారిటీలో చర్చకు తెరలేచింది.
రూ. 50 కోట్లు నిధులు ఇలా…
నగర శివారులో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఆ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి హెచ్‌ఎండిఎ నిధులను కేటాయిస్తున్నది. ఆ క్రమంలోనే సంగారెడ్డి(రూ.10కో ట్లు), భువనగిరి(రూ.14 కోట్లు), అమీన్‌పూర్(రూ.5 కోట్లు), పటాన్‌చెరు(రూ.5 కోట్లు), బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్ ప్రాంతాలకు మొత్తం సుమారు రూ. 20 కోట్ల వరకు కేటాయించింది. అయితే, కొన్ని ప్రాం తాల్లో ఈ పాటికే పనులు పూర్తయ్యాయి. మరి కొన్ని మండలాలకు చెందిన గ్రామాల్లో రోడ్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన అథారిటీకి స్థానిక ప్రజాప్రతనిధుల సహాకారం లభించడంలేదన్నది బహిరంగ రహాస్యం. ఇదిలా ఉండగా స్థానిక ప్రజాప్రతినిధుల సూచన మేర కు కొన్ని మండలాల్లోని గ్రామాల రోడ్ల అభివృద్ధికి కూ డా అథారిటీ నిధులను కేటాయిస్తున్నది. నిధుల కేటాయింపుతో పాటు టెండర్లు నిర్వహించి రోడ్లపనులను అథారిటీ చేపడుతోంది. అయితే, టెండర్లను నిర్వహించడం, పనులు చేపట్టడం, రెడిమిక్స్‌ద్వారా పనులు వేగ ంగా పూర్తిచేయడాన్ని గ్రహించిన కొందరు శివారు ప్రా ంత ప్రజాప్రతినిధులు రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదని పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రస్తావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తమ ప్రాంత కాంట్రాక్టర్లు చేపడితే పనులు వేగంగా, నాణ్యతగా జరుగుతాయనే అభిప్రాయాన్ని వారు పరోక్షంగా వెల్లడిస్తున్నట్టు తెలిసింది. నాణ్యతలేదనే విషయంలో థర్డ్ పార్టీని నియామకం చేద్దామని అథారిటీ అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నట్టు తెలిసింది.
జోక్యమిలా…?
రహదారుల నిర్మాణంలో నాణ్యతలేదని, మూడోపార్టీతో పరీక్షింపజేయాలనే ప్రతిపాదనను కొందరు ప్రజాప్రతినిధులు తెరపైకి తీసుకువచ్చినట్టు, పనులను చేపట్టడాన్ని నిలిపేయాలనే సూచనలు చేసినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో శివారు రోడ్ల ఏర్పాటు మరింత జాప్యం జరగడం, లేదా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలనే యోచనలో అథారిటీ అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది.

Comments

comments