Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మరణం లోనూ వీడని స్నేహం

Three Friends Died In Road Accident in Sangareddy Dist

అమీన్‌పూర్ ః రింగ్‌రోడ్డు మరోసారి నెత్తురొడింది…సర్వీస్‌రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అప్పటివరకు సంతోషంగా విహారిస్తున్న వారికి లారీ రూపంలో మృత్యువు కభలించడంతో బ్రతికున్నప్పుడే కాదు మరణంలోను వీరి స్నేహం వీడలేదు. ఈ విషాద ఘటన అమీన్‌పూర్ పోలీస్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డి పేట్ ఓఆర్‌ఆర్ సర్సీస్‌రోడ్డుపై చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంభందించి సీఐ రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ పాలిక్ జిల్లా రాయిపూర్ తాలుకా అత్తెల్లి గ్రామానికి చెందిన సూర్‌జ్‌సింగ్(22), బల్బీర్ (22), సుభాన్‌ఖాన్ (24). సూర్‌జ్ సింగ్ గత కొంత కాలం క్రితం నగరానికి వలసవచ్చి బాచుపల్లిలో నివాసం ఉంటు స్థానికంగా ఒక బట్టల దుఖానంలో పని చేస్తున్నాడు. సుభాన్ ఖాన్ చెన్నెలో పనిచేస్తున్నాడు. కాగా బల్బీర్ పనికోసం ఈ మధ్యకాలంలోనే ఉద్యోగం కోసం నగరంలోని సురాజ్‌సింగ్ దగ్గరికి వచ్చాడు. ఇరువురు హైదరాబాద్‌లో ఉన్నరని సమాచారం తెలసుకున్న సుభాన్‌ఖాన్ మిత్రులను కలిసేందుకు నగరానికి వచ్చారు. ముగ్గురు కలిసి బల్భీర్ ఉద్యోగ వేటలో భాగంగా పటాన్‌చెరులో నివాసం ఉంటున్న సూరజ్‌సింగ్ బంధువు పప్పుసింగ్ వద్దకు గురువారం వచ్చారు. ఆ రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు శుక్రవారం పప్పుసింగ్ ఇంటి వద్దే భోజనం ముగించుకుని ముగ్గురు స్రేహితులు ద్విచక్ర వాహనంపై పటాన్‌చెరు నుండి బాచుపల్లికి సర్వీస్ రోడ్డుపై బయలుదేరారు. కిష్టారెడ్డిపేట్ వద్ద వడక్‌పల్లి వెల్లే దారిలో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పప్పుసింగ్ సమాచారం అందించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న అమీన్‌పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

comments