Home బిజినెస్ ఫోర్బ్ జాబితాలో ముగ్గురు భారతీయులు

ఫోర్బ్ జాబితాలో ముగ్గురు భారతీయులు

  • ‘100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్’ లిస్టులో మిట్టల్, రతన్, ఖోస్లాకు స్థానం

Forbes-Lis

న్యూయార్క్ : అమెరికా బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్ జాబితాలో ముగ్గురు భారతీయులు లక్ష్మీ మిట్టల్, రతన్ టాటా, వినోద్ ఖోస్లాలు చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్ ప్రపంచంలో ‘100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్’ పేరిట ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఆర్సెలర్‌మిట్టల్ సిఇఒ, చైర్మన్ లక్ష్మీ మిట్టల్, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా ఉన్నారు. ఈ ప్రత్యేక జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నా రు. ఫైనాన్షియల్ జర్నలిస్ట్ బిసి ఫోర్బ్, ఆయన భాగస్వా మి వాల్టర్ డ్రేలు 1917 సెప్టెంబర్ 17న ఫోర్బ్ మ్యా గజైన్‌ను స్థాపించారు. ఫోర్బ్ మ్యాగజైన్ ఆరంభించి 100 ఏ ళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసింది. అందులో వ్యాపార చరిత్రలో సంచలనాలు, కొత్త పెట్టుబడులు ఎలా పెట్టాలి? వ్యాపారస్తుడి విజన్ ఎలా ఉం డాలి? వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా 100 వంది వ్యాపారస్తుల జాబితాను రూపొందించారు. వ్యాపారుల ఆలోచనలు, వారి వ్యక్తగత, వ్యాపార విశేషాలను అం దు లో వివరంగా తెలిపారు. ఫోరబ్స్ సిబ్బంది మాట్లాడు తూ, ప్రముఖ వ్యాపారస్తులపై ప్రత్యేక మ్యాగజైన్ తీసుకురావడాన్ని గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ఇంకా ఈ జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, వర్జి న్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, బర్క్‌షైర్ హాత్‌వే సిఇ ఒ వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గే ట్స్, న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రూపర్ట్ మర్డోచ్ ఉన్నారు. సిఎన్‌ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్, టాక్ షో మాస్టర్ ఓప్రా విన్‌ఫ్రే, డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మై ఖెల్ డెల్, టెల్సా అండ్ స్పేస్‌ఎక్స్ సహ వ్యవస్థాపకుడు ఎ లోన్ మస్క్, ఫేస్‌బుక్ సిఒఒ షెరిల్ సాండ్‌బర్గ్, స్టార్‌బక్స్ సి ఇఒ హోవర్డ్ చజ్, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జు కర్‌బర్గ్‌లు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
మోడీ కొత్త భారత్‌ను సృష్టిస్తారనే నమ్మకముంది : రతన్ టాటా
ప్రధాని నరేంద్ర మోడీపై తనకు అపారమైన విశ్వాసముందని, ఆయన కొత్త భారత్ సృష్టిస్తారని టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చినఇంటర్వ్యూలో టాటా ఈవిధంగా వ్యాఖ్యానించారు. సరికొత్త భారత్‌ను సృష్టించాలనే ప్రధాని మోడీ కలలు కంటున్నారని, ఆయన కలలకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని టాటా సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్ననాటి నుంచి నరేంద్రమోడీని సన్నిహితంగా గమనిస్తున్నానని, వే గంగా విధాన నిర్ణయాలు తీసుకుంటారని టాటా కొనియాడారు. పశ్చిమబెంగాల్ నుంచి గుజరాత్‌కు టాటా నానో కా రు ఫ్యాక్టరీ తరలిరావడానికి మోడీ ఎంతగానో సహకరించారని, కేవలం మూడురోజుల్లో భూకేటాయింపులు జరిపారని గుర్తుచేసుకున్నారు. భారత్‌ను కొత్తగా మలచడానికి అవసరమైన సృజనాత్మకత, సామర్థ్యం మోడీకి ఉన్నాయనిఆయన నాయకత్వంలో నవభారతం సాకారం కాగలదని నేను ఆశాభావంతో ఉన్నాను’ అని టాటా అన్నారు.