Home తాజా వార్తలు క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి

క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి

Three Killed

మేడ్చల్: బట్టలు ఉతికేందుకు వెళ్లి కాలుజారి క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి చెందిన సంఘటన జిల్లాలోని గాజులరామారం లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. కర్ణాటక లోని యాద్గిర్ గ్రామానికి చెందిన ఐలమ్మ, అనిత, యశ్వంత్ మేడ్చల్ జిల్లాలోని  గాజులరామారం బలయ్య నగర్ లో బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చారు. అయితే ఆదివారం బట్టలు ఉతకటం కోసం ఊరి బయట ఉన్న క్వారి గుంత  దగ్గరకు వెళ్లారు. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి ముగ్గురు క్వారీ గుంతలో పడ్డారు. ముగ్గురుకి ఈత రాక పోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Three Killed drown after falling into quarry Water