Home తాజా వార్తలు ఆఫ్ఘాన్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి

ఆఫ్ఘాన్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి

terrorist

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని పక్తియా ప్రావిన్స్‌లో రంజాన్ మాసం సందర్భంగా మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు మృతిచెందగా, మరో తొమ్మిది మంది వరకు గాయపడ్డారు. గార్డెజ్ నగరంలో గల మసీదులో ప్రార్థన జరుగుతున్న సమయాంలో దాడి జరిగినట్లు ఆఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.