Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

road-accident-image-doneనిజామాబాద్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ వద్ద శనవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ కుటుంబం కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలోని షిర్డీ సాయి దర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో వారు కారులో షిర్డీ నుంచి తిరిగి వస్తుండగా అంకాపూర్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఆ వెంటనే రోడ్డు పక్కన ఉన్న ఏటిఎంలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments