Home తాజా వార్తలు కారును ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి…

కారును ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి…

Road Accident

మేడ్చల్‌: వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన సంఘటన మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్‌ పరిధిలోని దూలపల్లిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను సూరారాం రాజీవ్‌ గృహకల్పకు చెందిన కూలీలు సాగర్‌(23), రోహిత్‌(17), భూమేశ్‌(14)లుగా గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Three Killed in Road Accident in Medchal

Telangana Breaking News