Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

అంతర్జాతీయ క్రీడాకారునికి ప్రభుత్వం రూ.౩ లక్షల నజరానా

               Foot-ball-Player

పెబ్బేరు: అంతర్జాతీయ స్థాయి లో ఫుట్ బాల్ క్రీడాకారుడు యశ్వంత్ కుమార్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల నజరా నాను ప్రకటించింది. మండల కేంద్రానికి చెందిన నరేష్‌కుమార్ ఉపాధ్యాయుడు తనయుడు య శ్వంత్‌కుమార్ చిన్నప్పటి నుండే పుట్‌బాల్‌లో ప్రా వీణ్యతనుసంపాదించి జిల్లా,రాష్ట్ర జాతీయ స్థాయి లో గుర్తింపుకునోచుకున్నారు.

అంతర్జాతీయ స్థా యిలో వివిధ దేశాల్లో పుట్‌బాల్‌లో రాణిస్తు ప్రశం సలతో పాటు నగదు పురస్కారాన్ని అందుకున్నా రు. ఆదాయపన్ను శాఖాలో విధులు నిర్వహిస్తు క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. సోమవారం పెబ్బేరు మండల కేంద్రంలో అంబేద్కర్‌యువజన సంఘం భవనంలో యశ్వంత్ కుమార్‌కు తెలంగాణ ప్రభు త్వం ప్రకటించిన రూ. 3 లక్షలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా అందివ్వనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం యశ్వంత్‌కుమార్‌కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో మార్కెట్ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, సర్పంచ్ అక్కి సుశీల సింగిల్‌విండో చైర్మన్ గౌని కోదండరా మిరెడ్డి, జడ్పిటిసి ప్రకాష్, కెల్‌ఆర్ స్పోర్ట్ నిర్వాహ కులు కృష్ణకుమార్‌రెడ్డి యశ్వంత్‌కుమార్‌కు ప్రత్యే క కృతజ్ఞతలు తెలిపారు.

Comments

comments