Home మెదక్ జాతీయ స్థాయి పెన్సింగ్ పోటీలలో జిల్లాకు మూడు పతకాలు

జాతీయ స్థాయి పెన్సింగ్ పోటీలలో జిల్లాకు మూడు పతకాలు

PENCING

మనతెలంగాణ/చేగుంట: జాతీయ స్థాయి పెన్సింగ్ పోటీలలో మెదక్ జిల్లాకు మూడు పథకాలు సాదించినట్లు కోచ్ కరణం గణేశ్ రవి కుమార్ తెలిపారు. ఈ నెల 5వతేది నుండి 9వ తేది వరకు జరిగిన అండర్14, అండర్19 ఈవెంట్లలో మెదక్ జిల్లాకు చెందిన క్రీడాకారులు మూడు పథకాలు సాదించారు. అండర్ 14 ఈపీ విబాగంలో టీ శ్రీకాంత్ ( తూప్రాన్ గీతా స్కూల్) ముఖేశ్ యాదవ్ ( దీప్తీ స్కూల్) వెండి పథకాలు సాదించగా అండర్ 19 ఈపీ టీం విబాగంలో మానస ( స్నేహ జూనియర్ కళాశాల చేగుంట) కాంస్య పథకం సాదించినట్లు తెలిపారు. మెదక్ జిల్లా నుండి ముగ్గురు జాతీయ పథకాలు సాదించడం పట్ల దీప్తి విద్యాలయం ప్రిన్సిపాల్ కృఫవరం, స్నేహ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్, తూప్రాన్ గీతాస్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు హర్షం వ్యక్తం చేసారు.