Home మంచిర్యాల శివరాత్రి వేడుకల్లో అపశృతి

శివరాత్రి వేడుకల్లో అపశృతి

పుణ్యస్నానానికి వెళ్లగా విషాదం
ఒకరి మృతదేహం లభ్యం
మిగతా వారి కోసం గాలింపు
పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్
పుణ్యస్నానాలతో పొటెత్తిన గోదావరి
ఎల్లంపల్లి నీటి విడుదలతోనే ప్రమాదం..?

Three Members Died Fell into Godawari River in Shivaratri Celebrationsమంచిర్యాలటౌన్/మంచిర్యాలఅర్భన్: శివరాత్రి పర్వదిన వేడుకలు నాలుగు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపాయి. పవిత్ర పుణస్నానం కోసం గోదావరి నదికి వెళ్ళిన నలుగురు యువకులు ఊహించని విధంగా నీటి ప్రవాహంతో కొట్టుకపోయి గల్లంతైనా ప్రమాద సంఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామ గోదావరిలో చోటు చేసుకుంది. ఈ సంఘ టనకు సంబంధించి పూర్తివివరాలు ఇవి..మంచిర్యాల పట్టణంలోని జాఫర్‌నగర్ ప్రాంతానికి చెందిన పానుగంటి శ్రీకాంత్ అనే డిగ్రి విద్యార్దితో పాటు పోతుల సుధాకర్, సాయితేజలు మిత్రులతో కలిసి పుణ్యస్నానాల కోసం గోదావరికి వెళ్ళారు.

నదిలో స్నానం చేస్తున్న క్రమంలో ఊహించని విధంగా నీటి ప్రమాదం పెరుగడంతో ఆందోళనకు గురి అయ్యారు.వీరిలో నలుగురు యువకులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా శ్రీకాంత్ సుధాకర్,సాయితేజలు నీటి ప్రవా హానికి మునిగిపోయారు. వీరితో పాటు నది మధ్యలో కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం కోసం వచ్చిన రామకృష్ణాపూర్ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి కూడ నీటి నుంచి బయటకు వచ్చే క్రమంలో అదుపుతప్పి నీటిలో గల్లంతు అయ్యాడు. ఎలాంటి ముందుజాగ్రత్త హెచ్చరికలు లేకుండా ప్రాజెక్టు గేట్ నుండి నీటిని విడుదలచేయడంతోనే గోదావరి ప్రవాహం పెరిగి ఈ ప్రమాదం జరిగినట్లు స్దానికులు పేర్కోంటున్నారు. గల్లంతైనా వారి కోసం గజ ఈతగాళ్ళు, సింగరేణి రెస్కూ సిబ్బంది ముమ్మరంగా గాలిం చగా శ్రీకాంత్ మృతదేహం మాత్రమే లభ్యమైంది.

కలెక్టర్ పర్యవేక్షణలో గాలింపు చర్యలు

గోదావరి నదిలో గల్లంతైనా వారి ఆచూకి కోసం జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ పర్యవే క్షణలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే కలెక్టర్‌తో పాటు డిసిపి జాన్‌వెస్లీ, సిఐ సుధాకర్, తహాసిల్దార్ మోహన్‌రెడ్డి, హాజీపూర్ ఎస్సైతాసినోద్దీన్‌లు సంఘటన స్దలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. శుక్ర వారం సాయంత్రం వరకు మిగతా ముగ్గురి ఆ చూకీ లభ్యం కాకపోడవంతో శనివారం ప్రత్యే క సింగరేణి రెస్యూ బృందంతో గోదా వరి నదిలో గాలింపు చర్యలను చేపట్టనున్నారు.

కుటుంబాలలో విషాదం

పండుగవేళా కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుకోవాల్సిన కుటుంబాలలో ఊహించని ప్రమాదం. తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాస దీక్షల కోసం శివభక్తులైన యువకులు పుణ్యస్నా నాల కోసం గోదావరికి వెళ్ళగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే..దీంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న శ్రీకాంత్,సుధాకర్,సాయితేజలు నీటిప్రవాహంలో గల్లంతు కాగా విషయం తెలిసినా కుటుంబసభ్యులు ప్రమాద ప్రాంతానికి చేరుకొని కన్నీరుము న్నీరుగా విలపిస్తున్నారు. ఏదిగాన కొడుకులు ప్రమాదానికి గురయ్యారనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక బోరునా విలాపిస్తున్నారు. కలెక్టర్ ఆర్వీకర్ణన్ సంఘటన స్దలం వద్ద కు చేరుకోగా ఆయనను పట్టుకొని శ్రీకాంత్ కుటుంబసభ్యులు విలాపించడం పలువురికి కంటతడిపెట్టింది.