Home తాజా వార్తలు చెట్టును ఢీకొట్టిన కారు: ముగ్గురి మృతి

చెట్టును ఢీకొట్టిన కారు: ముగ్గురి మృతి

Car-Accident-in-Nalgonda

 

 

పెద్దవూర: నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దవూర మండలం పోతనూరు స్టేజీ సమీపంలో  చెట్టుకు కారు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక వైద్యశాలకు తరలించారు. స్నేహితులంతా కలిసి బందరు బీచ్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నాగర్ కర్నూలు కు చెందినవారిగా గుర్తించారు.