Home తాజా వార్తలు కోటిలింగాల వద్ద అగ్నిప్రమాదం: పది మంది మృతి

కోటిలింగాల వద్ద అగ్నిప్రమాదం: పది మంది మృతి

Fire-Accident-in-Kotilingal

కోటిలింగాల: వరంగల్ జిల్లా కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్ గోదాములో  బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది కార్మికులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో 20 మందిపైగా గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గోదాము వద్ద మృతదేహాలు, అవయవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.  గోదాము పరిసర ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. బాణ సంచా తయారీ గోదాములో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు  ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని  మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.  బాణసంచా పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున శబ్దాలు రావటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యలను వరంగల్ గ్రామీణ కలెక్టర్ హరిత, సిపి విశ్వనాథ్ రవీందర్ పర్యవేక్షిస్తున్నారు.