Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

అమెరికాలో కాల్పులు

తెలుగు యువకుడు పృథ్వీరాజ్ కందేపి సహా ముగ్గురు దుర్మరణం

America 

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. సిన్సినాటి బ్యాంక్ భవనంలో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఒకరు ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన వ్యక్తి కాగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా హతమయ్యాడు. సిన్సినాటిలోని ఫౌంటైన్ స్కేర్ సమీపంలో ఉన్న ఫిఫ్త్ థర్డ్ బ్యాంక్ ప్రధా న కార్యాలయంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓహియో ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఒమర్ ఎన్రిక్ శాంటా పెరెజ్ బ్యాంక్ భవనంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు.

ఈ ఘటనలో ఇద్దరు స్థానికులతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్ కందేపి( 25)కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరిని లూయిస్ ఫెటిప్ కాల్డెరాన్(48), రిచర్డ్ న్యూకమర్(64)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పులు జరపడానికి కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

దుండగుడికి బ్యాంకుతో ఎలాంటి సంబంధం లేదని, మాజీ ఉద్యోగి కూడా కాదని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కాల్పుల్లో మృతి చెందిన పృథ్వీరాజ్ బ్యాంకులో ఫైనాన్స్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాడు. పృథ్వీరాజ్ మృతి గురించి పోలీసులు భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. పృథ్వీరాజ్ మృతదేహాన్ని అతని స్వస్థలానికి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) ప్రతినిధి ఒకరు చెప్పారు.

Comments

comments