Home ఖమ్మం వేర్వేరు రోడ్డు ప్రమాదాలు : ముగ్గురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు : ముగ్గురి మృతి

road-accident-image-doneహైదరాబాద్: ఖమ్మం జిల్లాలో రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కల్లూరు మండలం రామకృష్ణాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. కొత్తగూడెం మండలం రామవరం వద్ద బొగ్గు లారీ అదుపు తప్పి షాపులోకి దూసుకెళ్లింది. లారీ షాపులోకి దూసుకెళ్లడంతో పలు షాపులు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.