నేచురల్ స్టార్‌గా వెండితెరపై అలరించిన నాని రీసెంట్గా బిగ్ బాస్ 2 రియాలిటీ షోతో వెండితెరకి ఎంట్రీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నాని తన ఫాలోవర్స్ సంఖ్య మూడు మిలియన్స్‌కి చేరుకున్నాడు. ఈ సందర్భంగా నాని నా కుటుంబం ఇప్పుడు మూడు మిలియన్ల స్ట్రాంగ్ అంటూ ట్వీట్ చేసాడు. నాని చేసిన ట్వీట్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. దక్షిణాదిలో 6 మిలియన్లకి పైగా ఫాలోవర్స్ ఉన్న వారిలో మహేష్, ధనుష్, సమంత ఉన్నారు. త్వరలో ఆ మార్కుని అందుకోవాలని నాని ఉబలాటపడుతున్నాడు.
ఈ మధ్యనే ‘మనం సైతం’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. చిత్ర పరిశ్రమలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకుంటూ నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారని హీరో నాని కొనియాడాడు. ‘మనం సైతం’ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి చేయూతనిస్తున్న కిరణ్ ప్రస్థానం అలాగే కొనసాగించాలని నాని ఆకాంక్షించాడు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ‘మనం సైతం’ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రచయిత సాయి మాధవ్ తదితరులతో కలిసి నాని హాజరయ్యాడు. ఎనిమిది మంది బాధిత కుటుంబాలకు, పలువురు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. మనం సైతం బృందానికి ఎల్లవేళలా అండగా ఉంటామని నాని అంటున్నాడు.