Home తాజా వార్తలు కొత్త మున్సిపాలిటీగా కొలువుదీరిన కొంపల్లి

కొత్త మున్సిపాలిటీగా కొలువుదీరిన కొంపల్లి

బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమీష్‌నర్ జ్యోతి
మూడు మున్సిపాలిటీలు, రెండు జిహెచ్‌ఎంసి సర్కిళ్లుగా విభజించబడ్డ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
అభివృద్ది వైపు పరుగులు తీయడం ఖాయంటున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు

మనతెలంగాణ/షాపూర్‌నగర్:  నిన్నా మొన్నటి వరకు గ్రామపంచాయితీగా ప్రజలకు సేవలు అందించిన కొంపల్లి , దూలపల్లి గ్రామాలు ఇక నుంచి కొత్త ఒరవడితో మున్సిపాలిటిగా సేవలు అందించనున్నాయి. జిహెచ్‌ఎంసి పరిధికి అతీ దగ్గరగా ఉన్న గ్రామాల్లో దూలపల్లి, కొంపల్లిలు ఉండటంతో అంతా జిహెచ్‌ఎంసిలో కలుపుతారని ఆశీస్తుండగా ప్రభుత్వం మాత్రం మున్సిపల్ ఆలోచనకే పట్టం కట్టారు నాయకులు. పంచాయితీ పదవీ కాలం పూర్తి అయిన వెంటనే మున్సిపాలిటిగా ప్రకటించడంతో ప్రతేక్య అధికారులు పాలనకు సిద్దం అయ్యారు . ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం పదవీ బాధ్యతలను చేపట్టిన మున్సిపల్ కమీష్‌నర్లు మొదటి రోజు విధులు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అర్బన్ రూరల్‌కలిపుకొని మూడు మున్సిపాలిటిలు, జిహెచ్‌ఎంసి పరిధిలో రెండు సర్కిళ్లుగా విభజించబడటంతో అభివృద్దిలో వేగం పుంజుకుంటుంటున్న నాయకులు సమస్యలు లేకుండా సకాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించబడుతాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అంటే గతంలో ప్రజా సమస్యలకు నిలయంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన పలు సంస్కరణలో జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న అర్బన్‌ను కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లుగా విభజించి వేరువేరు కార్యాలయాలు ఏర్పాటుచేసి ప్రజా సేవలను మెరుగుపరిచారు. అదేవిధంగా రూరల్ విషయంలో సైతం అదే తీరును కొనసాగించిన ప్రభుత్వం గ్రామ పంచాయితీలుగా ఉన్న 11 గ్రామాలను పదవీ కాలం పూర్తి కావడంతో మూడు మున్సిపాలిటిలుగా విభజించింది. మొదట దుండగల్ మున్సిపాలిటిని ఏర్పాటు అవగానే ఇటీవల పదవీ కాలం పూర్తయిన ఆరు గ్రామాలు నిజాం పేట మున్సిపాలిటి, కొంపల్లి మున్సిపాలిటిలుగా ఏర్పడ్డాయి. ఆదివారం ఆయా మున్సిపాలిటిలో పదవీ బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమీష్‌నర్లు, నిజాంపేట కమీష్‌నర్ ఇసాక్‌ఖాన్,కొంపల్లి కమీష్‌నర్‌గా వచ్చిన ఎంఎన్‌ఆర్ జ్యోతిలు పదవీ భాద్యతలు చేపట్టి మొదటి రోజు ఆయా గ్రామ పంచాయితీల సెక్రటరీలను విషయాలు, సమస్యలు, అడిగి తెలుసకున్నారు.

ఎన్నికలు వస్తాయనుకున్న నేతల ఆశలు ఆడియాశలు ఆయ్యేనా?.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌తో పాటు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే కొత్త మున్సిపాలిటిలు ఏర్పడుతాయని కొంత మంది ప్రజాప్రతినిధులు కలలు కన్నారు. ప్రతి రాజకీయపార్టీలో కౌన్సిలర్, వార్డుమెంబర్లు, మున్సిపల్ ఛైర్మెన్ పదవుల కోసం రేసుల్లో ఉన్న నాయకుల ఆశలు అడియాశలు అయ్యాయి. నిన్న మొన్నటి వరకు ఎన్నిల వస్తాయంటూ బిజిబిజిగా గడిపిన నాయకులు ఆదివారం మున్సిపల్ అధికారులు పదవీ భాద్యతలు చేపట్టడంతో నాయకులు ఎన్నికలు ఇక ఇప్పట్లో ఉండవు మరో ఆరునెలల సమయం ఉంది కదా అంటూ తమ సొంత పన్నుల్లో బిజిగా మారారు. అయితే దుండిగల్ మున్సిపాలిటిలో మాత్రం ఇప్పటికే 15 వార్డులు ఏర్పాటు చేసి పాలన అందిస్తుండటంతో అక్కడైనా ఎన్నికలు ఉంటాయా లేక కొత్త మున్సిపాలిటిలతో కలిపి అన్ని చోట్ల ఒకే సారి మున్సిపల్ ఎన్నికలు నిర్వాహిస్తారా అంటూ నేతల్లో దుండిగల్ మున్సిపల్ పరిధిలోని నేతల్లో ఉత్కంఠ మొదలైందంటూ చర్చలు జోరుగా సాగుతున్నాయని సమాచారం.

కుత్బుల్లాపూర్ అర్బన్‌లో రెండు జిహెచ్‌ఎంసి సర్కిళ్లు , రూరల్‌లో మూడు మున్సిపాలిటిలతో అభివృద్ది వేగం ఖాయం….
కుత్బుల్లాపూర్ నియోజికవర్గం ఇక నుంచి అభివృద్దిలో దూసుకుపోతుందంటున్నారు. టిఆర్‌ఎస్‌పార్టీ నాయకులు మాజీ సర్పంజ్ జక్కుల క్రిష్ణా యాదవ్, అన్ని మున్సిపాలిటిలలో ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించడానికి ప్రభుత్వ మున్సిపాలిటిలను ఏర్పాటు చేయడం అభినందనీయం అంటున్నారు మాజీ సర్పంజ్ జక్కుల. సర్కిళ్లలో కమీష్‌నర్లు అభివృద్దిపై దృష్టి సారించగా, నూతన మున్సిపాలిటిలలో ప్రత్యేక అధికారులుగా వచ్చిన మున్సిపల్ కమీషనర్లు ఇక అభివృద్దిలో నాయకులను, ప్రజలకు భాగసౌమ్యం చేసుకుంటుపోతే సమస్యలు లేని కుత్బుల్లాపూర్‌ను చూడవచ్చంటున్నారు నాయకులు.