Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

పిడుగుపాటుతో ముగ్గురి మృతి

three-mumbers-killed-image

జైపూర్‌: భీమారం మండలంలోని ఆరెపల్లిలో తెల్లవారు జామున ఆకాల వర్షంతో తమ పంటలను కాపాడుకోవడానికి పొలం వద్దకు వెళ్లి పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందారు. రాజయ్య, రమేష్, రాజంల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు హామీ ఇచ్చారు. ఆదివారం సంఘటన స్థలానికి చేరుకొని ఆపద బంధు చెక్కులను మృత్యుల కుటుంబాలకు అందించారు. తన వంతుగా 5 వేల చొప్పున 15 వేల నగదు అందించారు. బాధిత కుటుంబాల పిల్లలను అన్ని విధాలుగా ఆదుకొని చదివిస్తామని, బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పన నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

పిడుగుపాటు మృతులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: తెలుగు యువతి ప్రధాన కార్యదర్శి సంజయ్
భీమారం మండలం ఆరెపల్లిలో భారీ వర్షానికి పిడుగుపడి ముగ్గురు మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వెంటనే ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 3 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్షంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసినట్లయితే వీరు మృత్యువాత పడేవారు కాదని న్నారు. వెంటనే ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాగర్, శేఖర్, రైతులు రామన్న, తిరుపతి, రమేష్ , తదితరులు ఉన్నారు.

Comments

comments