Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

నేనేం తక్కువ కాదు..!

Three Pro Wrestlers Play Tug Of War With A 2.5 Year-Old Lion Cub

‘టగ్ ఆఫ్ వార్’ ఆట గుర్తుండే ఉంటుంది కదా… ఎప్పుడైనా అందరం కల్సి షికారుకు వెళ్లినప్పుడు సరదాగా ఆడుకునే ఆట ఇది. సాధారణంగా ఈ ఆటలో రెండు వర్గాలుగా విడిపోయి ఒక తాడును లాగుతారన్నమాట. ఎవరు తాడును తమవైపునకు లాగు తారో వారు గెలిచినట్లు లెక్క. ఇంత వరకూ ఇద్దరు మనుషుల గ్రూపులు ఈ ఆట ఆడు కోవడం మనకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం ఒక వర్గం మారిందన్న మాట. ముగ్గురు డబ్లుడబ్లుఇ రెస్లర్స్‌కి, ఒక సింహం పిల్లకు టగ్ ఆఫ్ వార్ గేమ్ జరిగింది. ఈ మ్యాచ్ గత నెలలో టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియా జూలో జరిగింది. రెండున్నర ఏళ్ల సింహం పిల్ల ఒక వైపు తన నోటితో తాడును పట్టుకోగా… అటువైపు రికోచట్, ఫేబియన్ అయినర్, కిల్లియన్ డెయిన్ అనే మల్లయోధులు తాడును లాగుతున్నారు. ఇంతకీ గెలుపు ఎవరిదనేగా… ఇంకెవరిది కేవలం 400పౌండ్లు ఉన్న సింహం పిల్లదే. ఈ పోస్ట్‌ను సాన్ ఆంటోనియా జూ వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ పోస్ట్‌ను 2,34,784 మంది చూశారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. జూ కీపర్స్ 2016 నుంచి జూలోని కొన్ని జంతువులకు ఈ గేమ్‌పై శిక్షణ ఇచ్చారట. జంతువుల్ని తక్కువ అంచనా వేయవద్దని చెబుతున్నారు జూ అధికారులు.

Comments

comments