Home అంతర్జాతీయ వార్తలు ఆస్ట్రేలియా ఎన్నిక బరిలో ముగ్గురు భారతీయులు

ఆస్ట్రేలియా ఎన్నిక బరిలో ముగ్గురు భారతీయులు

Punjabies-in-Australia-elecమెల్‌బోర్న్: ఆస్ట్రేలియా రాజకీయాల్లో భారతీయులు చురుగ్గా భాగస్వా ములవుతున్నారు. మెల్‌బోర్న్‌కు శివారులో ఉన్న విటిల్‌సీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ముగ్గురు పంజాబీ ఆస్ట్రేలియన్లు పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు భారతీయులు గెలవలేదు. అయినప్పటికీ గత చరిత్రతో సంబంధం లేకుండా లఖ్వీందర్ సింగ్ థిల్లాన్, గురీందర్ కౌర్, జుడగేబిర్ సింగ్ బరిలో నిలిచారు. ఈ నగరం జనాభా 1,54,900. వీరిలో ఇంగ్లిష్, మేసిడోనియన్లు, ఇటాలియన్లు, గ్రీకులు, భారతీయులు ఉన్నారు. ఈ జోన్‌లో ఉన్న దాదాపు 40 వేల మంది ఓటర్లు నలుగురు కౌన్సిలర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ప్రిఫరెన్స్ ఓటింగ్ సిస్టమ్‌ద్వారా వచ్చే నెల 21న ఎన్నికల జరుగుతాయి.