Home హైదరాబాద్ అశ్రునయనాల మధ్య ముగ్గురు అక్కాచెల్లెళ్ల అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య ముగ్గురు అక్కాచెల్లెళ్ల అంత్యక్రియలు

                         Funeral

మన తెలంగాణ/గోషామహల్: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని పూజలు నిర్వహించేందుకు కర్నాటక రాష్ట్రంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బడీచౌడి ప్రాం తానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కోనేరులో ము నిగి మృతిచెంది న ఘటన పాఠకులకు విదితమే. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను మంగళవారం తెల్లవారుజామున నగరానికి తీసుకురాగా, ప్రవల్లిక, పవిత్ర, పావనిల మృతదేహాలకు బడీచౌడీకి, వారి బంధువులు ఆశిష్, రాఘవేందర్‌ల మృతదేహాలను బోయి న్‌పల్లికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చేరుకోవడంతో బడీచౌడీలో విషాదఛాయలు అలముకున్నా యి.

విషయం తెలుసుకున్న బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రె డ్డి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ప్రేమ్‌సింగ్‌రాథోడ్, గన్‌ఫౌంఢ్రీ కార్పోరేటర్ మమతాగుప్తా, మాజీ కార్పోరేటర్లు ఎం శంకర్‌యాదవ్, ఎం రామచంద్రరాజు, సీనియర్ టిఆర్‌ఎస్ నా యకులు న్యాయవాది రాజశేఖర్, సంతోష్‌గుప్తా, టిపిసిసి కార్యదర్శి ఎం విక్రమ్ గౌడ్, టిడిపి గ్రేటర్ అధ్యక్షులు ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు, నాయకులు జయరాజ్‌యాదవ్ బడీచౌడీకి చేరుకుని తమ కూతుళ్లు ఇక లేరంటూ రోదిస్తున్న తల్లిందడ్రులు అరుణ, ప్రకాష్‌లను ఓదార్చేందుకు యత్నించారు. ప్రవల్లిక, పవిత్ర, పావనిల మృతదేహాలను కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి భౌతికకాయాలను చూ సి, వారితో గడిపిన క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుని కంట తడి పెట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు బంధువులు, స్నేహితులు, స్థానికుల అశ్రునయనాల మధ్య వారి భౌతికకాయాలను అంబర్‌పేట స్మశానవాటికకు తరలించారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతికి సంతాప సూ చకంగా మంగళవారం బడీచౌడీ మార్కెట్‌ను మూసివేశారు.