Home తాజా వార్తలు ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

Drown-Swimming

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం పల్లిమక్తలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు సమీపంలోని నీటికుంటకు ఈతకెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకేసారి గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో పల్లిమతక్తలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.