Home తాజా వార్తలు ముగ్గురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

ముగ్గురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

Encounter

శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్ అయ్యారు. సోమవారం ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది జులైలో అమర్‌నాథ్ యాత్రికులపై కాల్పులు జరిపింది ఎన్‌కౌంటర్‌కు గురైన ఉగ్రవాదులేనని భద్రతాబలగాలు వెల్లడించాయి.

Three Terrorists Encounter