Home జాతీయ వార్తలు ముగ్గురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

ముగ్గురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

Three Terrorists Encounter in Jammu Kashmir

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కాక్రియాల్‌లో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 12మంది సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించినట్టు జమ్మూకశ్మీర్ ఐజిపి డాక్టర్ ఎస్‌డి సింగ్ జామ్వాల్ తెలిపారు. హతమైన ఉగ్రవాదులు పాక్‌లోని జైష్ -ఎ- మొహ్మద్ సంస్థకు చెందిన వారిగా గుర్తించామని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల కదలికలతో ఈ ప్రాంతంలో భద్రతాబలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Three Terrorists Encounter in Jammu Kashmir