Home జనగామ లింగంపల్లి ప్రాజెక్టుకు మూడు వేల కోట్లు మంజూరు

లింగంపల్లి ప్రాజెక్టుకు మూడు వేల కోట్లు మంజూరు

Three thousand crore sanctioned for Lingampalli project

మనతెలంగాణ/భీమదేవరపల్లి : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని లింగంపెల్లి  ప్రాజెక్టుకు మూడువేల కోట్లు మంజూరైనవని ఈ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా జూన్ నెలలో ప్రాజెక్టు పనులు ప్రారంభం చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి,హుస్నాబాద్ ఎమ్మేల్యే వొడితెల సతీష్‌కుమార్‌లు వెల్లడించారు. సోమవారం మండలంలోని మల్లా రం గ్రామంలో చెక్కులు, పాస్‌బుక్కుల పంపిణీ జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లింగంపల్లి ప్రాజెక్టు ద్వారా స్టేషన్ ఘన్‌పూర్, హుస్నాబాద్ నియోజక వర్గంలోని కొన్నిగ్రామాలకు సాగు నీటిని మల్కాపూర్ రిజర్వాయర్ ద్వార సాగునీటిని అందిస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు నీటిని అందించే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 6 నెలల్లోగా సాగునీటిని అందిస్తామన్నారు.ఆగస్టు నెలలో పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.ఈ సమావేశంలోఅన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు , రైతులు పాల్గొన్నారు.