Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో దారుణం…!(వీడియో)

Young Men molested Girl in UP

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో మరో దారుణం జరిగింది. కొందరు ఆకతాయిలు 16 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించడమే కాకుండా ఆ తతంగాన్ని వీడియో తీశారు. యువతి పట్ల యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లేందుకు యత్నించారు. అయితే, యవతి కేకలు వేయడంతో అక్కడే యువకులు ఆగిపోయారు. ఈ తతంగాన్ని మరో యువకుడు తన మొబైల్‌లో రికార్డు చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసుల విచారణలో ఈ ఘటన ఈ నెల 12న జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

(Courtesy By: NYOOOZ TV)

Comments

comments