చిత్తూరు : కురబలకోట సమీపంలోని కడప – బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. రహదారిపై ఆగి ఉన్న ఐషర్ వాహనాన్ని వెనక నుంచి బైక్ వచ్చి వేగంగా ఢీకొంది. మృతులను కురబలకోట పంచాయతీ పుట్టారెడ్డిగారిపల్లెకు చెందిన చంద్రశేఖర్, దేవేందర్, దినేశ్గా గుర్తించారు. రహదారిపై పొగమంచు అలుముకుని ఉండడంతో ఆగి ఉన్న వాహనాన్ని గమనించకపోవడం, అతివేగం ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.