Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కొత్త అనుభూతినిచ్చే థ్రిల్లర్

Manchu

ఆద్యంతం ఉత్కంఠతను కలిగించే కథ, కథనాలతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతినిచ్చే ‘వైఫ్ ఆఫ్ రామ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన మంచు లక్ష్మి మాట్లాడుతూ ‘నేను చేసిన దీక్ష పాత్ర అందరికీ నచ్చుతుంది. ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దాడు. దర్శకుడు విజయ్‌ని ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ సమయంలో కలవడం జరిగింది. అతని వర్కింగ్ స్టైల్ నచ్చి ఈ సినిమా చేశాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే చిత్రమిది”అని అన్నారు. దర్శకుడు విజయ్ యలకంటి మాట్లాడుతూ ‘దీక్ష పాత్రకు మంచు లక్ష్మి పూర్తి న్యాయం చేశారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. నేను ఎప్పుడు ఆర్టిస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని పాత్రలు రాయ ను. అందుకే ఈ పాత్రపై మంచు లక్ష్మి ఇమేజ్ పడలేదు. మా కథను అర్థం చేసుకొని సినిమాటోగ్రాఫర్ సామల భాస్కర్, ఎడిటర్ తమ్మిరాజులు పనిచేశారు. రఘు దీక్షిత్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా ఉంటుంది’అని తెలిపారు. నటుడు ఆదర్శ్ మాట్లాడుతూ ‘బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక నాకు వచ్చిన మొదటి ఆఫర్ ఇది. ముందుగా వర్క్‌షాప్‌లు నిర్వహించడంతో లొకేషన్‌లో సీన్ చేయడం చాలా ఈజీ అయింది. సినిమాలోని నా పాత్ర నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు. సినిమాటోగ్రాఫర్ సామల భాస్కర్ మాట్లాడుతూ “ఈ కథతో నేను చేసిన ప్రయాణం ఎప్పటికీ మరచిపోలేను. 27 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాం”అని చెప్పారు.

Comments

comments