Search
Wednesday 21 November 2018
  • :
  • :

థ్రిల్లింగ్ విజువల్స్‌తో…

Anthariksham

తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి స్పేస్ నేపథ్యంలో వస్తున్న సినిమా ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కాగా దీపావళి సందర్భంగా ఫిల్మ్‌మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తన మొదటి సినిమా ‘ఘాజీ’తో నేషనల్ అవార్డును గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్‌తేజ్, బాలీవుడ్ హీరోయిన్ అదితిరావు హైదరీలు వ్యోమగాములుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది. థ్రిల్లింగ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతోంది. ఈ సినిమాను దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌ః జ్ఞానశేఖర్, సంగీతంః ప్రశాంత్ విహారి.

Thrilling Visual Effects of Anthariksham 9000 KMPH

Telangana News 

Comments

comments