Home జోగులాంబ గద్వాల్ మిషన్ భగీరథ పరుగులు

మిషన్ భగీరథ పరుగులు

Mission Bhagiratha water

 

ముగింపు దశలో పనులు
జిల్లావ్యాప్తంగా 69,446 గృహాలకు నల్లా కనెక్షన్లు
320 గ్రామాలకు ట్రయల్న్
జూరాల నుంచి 1.470 టీఎంసీలు
రూ. 384 కోట్లతో నీటిశుద్ధి ప్లాంట్ పూర్తి
13 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం
849.5 కిలోమీటర్లు పూర్తయిన పైప్‌లైన్
మార్చి 31లోగా పూర్తి చేయాలని సిఎం ఆదేశం

మన తెలంగాణ/ గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకం పల్లెపల్లెకు శుద్ధి నీటిని అందించడమే ఈ పథకం లక్షం. జిల్లా వ్యాప్తం గా ఇప్పటికే 93శాతం పనులు పూర్తయ్యాయి. ప్రజలకు మంచినీటిని అందించేందుకుఉ జూరాల ప్రాజెక్టు నుంచి 1. 470 టీఎంసీ నీటిని సేకరించి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు తరలిస్తారు. ఇది ఆగస్టు నాటికే పూర్తయినా అనివార్య కారణాల తో ప్రారంభం కాలేదు. రెండు విభాగాల్లో జరిగే పనుల్లో ఒక టి ట్రీట్‌మెంట్ (శుద్ధి ప్లాంట్), రెండోది ఇంట్రావెల్. దీంట్లో పైప్‌లైన్ల నిర్మాణ పనులు కాస్త పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ని కూడా త్వరలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

మార్చి 31 నాటికి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా మిషన్ భగీరథ అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ జోగుళాంబ గద్వా ల జిల్లాలో పరుగులు తీస్తోంది. తెలంగాణలో తొలుత పూర్తయిన మిషన్ భగీరథ నీటిశుద్ధి ప్లాంట్ ఆగస్టు నాటికే పూర్తయింది. మరో పక్క ఇంట్రావెల్స్ పథకం కింద గ్రామాలకు పైప్‌లైన్లు వేయడం, ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వడం వం టి పనులు 93శాతంగా పూర్తిచేశారు. మున్సిపాలిటీలను క లుపుకొని జిల్లాలో 69,446 గృహాలకు నల్లా కనెక్షన్లు ఇ చ్చారు. 12 మండలాల్లో 320 గ్రామాలకు ట్రయల్న్ పేరుతో మంచినీటిని అందిస్తున్నారు. మార్చిలోగా అ న్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికా ర యంత్రాంగం చెబుతోంది.

రూ. 700 కోట్ల వ్యయంతో…
భగీరథలో రెండు దశల్లో పనులు సాగుతాయి. మొదటి ట్రీట్‌మెంట్, రెండో ది ఇంట్రావెల్స్. జిల్లాలోని 12 మండలాల్లో నీటి సరఫరా కోసం రూ.700 కోట్లతో జూరాల ప్రా జెక్టు వద్ద 1.470 టీఎంసీల నీటిని శుద్ధి చేసి ప్రజలకు అందిస్తారు. రూ.700 కోట్లు కేటాయించినా రూ.384 యకోట్లతో శుద్ధి ప్లాంట్ పూర్త చేశారు. మిగతా డబ్బులను పదేళ్ల పాటు నిర్వహణ కింద కేటాయించారు. ఆర్‌డబ్లూఎస్ ఇంట్రావెల్ ప్రోగ్రాం ద్వారా గ్రామాల్లో వాటర్‌ట్యాంకులు, పైప్‌లైన్లు, ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. శుద్ధి ప్లాంట్ కింద 13 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. గ్రామాలకు నీరందించేందుకు 23 సర్వీస్ ట్యాంకులను నిర్మించారు. 6,07,139 మంది జనాభాకు అనుగుణంగా పల్లెల్లో నివసించే ప్రజలకు ఒక్కొక్కరికి 100 లీటర్లు, పట్టణాల్లో నివాసముండే వారికి 150 లీటర్లు శుద్ధి పర్చిన నీటిని ఈ పథకం ద్వారా సరఫరా చేయనున్నారు.

93శాతం పూర్తయిన పనులు…
ఇంట్రావెల్స్‌లో సాంకేతిక లోపాలతో పైప్‌లైన్ల లీకేజీలు, ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వడం ఆలస్యమవుతుండటంతో పథకం డిసెంబర్ నాటికి కూడా పూర్తి కాలేదు. మార్చి 31లోగా పూర్తి చేయాలని, సీఎం కేసీఆర్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. శుద్ధి ప్లాంట్ కోసం 389.5 కి.మీలు, ఇంట్రావెల్స్ కింద 460 కి.మీల మేర పైప్‌లైన్లను పూర్తి చేశారు. గట్టు వంటి ఎత్తైన ప్రాంతంలో పనులు చేపట్టేందుకు కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. ప్రధానంగా పైపులు ఇచ్చినా వాటికి నల్లా కనెక్షన్లు ఇవ్వకపోవడంతో కొంతమేర పనులు సాగుతున్నాయి. మరికొన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలను మిషన్ భగీరథకు అనుసంధానం చేయడం వంటి పనులు మిగిలి ఉన్నాయి.

అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 12మండలాలకు నిత్యం 70 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే)గా నీటిని అందిస్తారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ప్రారంభిస్తారో ఖరారు కావాల్సిన అంశంగా మిగిలింది. శుద్ధి ప్లాంట్‌లోకి జూరాల నుంపచి తీసుకున్న నీటిని శుద్ధి చేయడానికి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పదంచెలతో నీటిని శుద్ధిపర్చి ప్రజలకు సురక్షితమైన నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో నూటికి నూరుశాతం పూర్తి చేయడానికి అధికారులు శ్రమిస్తున్నారు.

Through Mission Bhagiratha is to provide purified water for villages

Telangana Latest News